గోస్పాడు: జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర పరిశీలకులు, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ దేవసాగర్, కన్సల్టెంట్ రమేష్ సూచించారు. వారు గురువారం జిల్లాలోని శిరివెళ్ల, ఎర్రగుంట్ల, బనగానపల్లె, మద్దూరు, గోస్పాడుతో పాటు నంద్యాల పట్టణంలోని అర్బన్ ఆస్పత్రులను తనిఖీ చేశారు. వారు మాట్లాడుతూ.. ఈనెల 25న జిల్లాలో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఆల్బెండజోల్ మాత్రలను పిల్లలందరికీ అందించేలా కృషి చేయాలన్నారు. అనంతరం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి చాంబర్‌లో డీఎంహెచ్‌ఓ శారదాబాయి ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాకు వచ్చిన అల్బెండజోల్ మాత్రలను అన్ని ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాలకు అక్కడి నుంచి అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వ ప్రైవేటు విద్యాసంస్థలకు చేర్చిన వివరాలు, కార్యక్రమం నిర్వహణ గురించి అడిగి తెలుసుకున్నా రు. నిర్వహణపై పలు సూచనలు చేశారు. జిల్లా ప్రో గ్రాం అధికారులు, డిప్యూటీ డైరెక్టర్ – ప్రోగ్రాం అధి కారి అనిల్‌కుమార్ రెడ్డి, డాక్టర్ జగదీష్ చంద్రరెడ్డి, డాక్టర్ కాంతారావు నాయక్, సిబ్బంది పాల్గొన్నారు.


