కూటమి నేతలు ‘నీళ్లు’ నములుతున్నారు | - | Sakshi
Sakshi News home page

కూటమి నేతలు ‘నీళ్లు’ నములుతున్నారు

Sep 1 2026 1:43 AM | Updated on Sep 1 2026 1:43 AM

రైతులు ఆందోళనలు చేస్తున్నా

కన్నెత్తి చూడని వైనం

ఆత్మకూరు: శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకున్నా జిల్లాలోని సాగునీటి కాల్వలు వెలవెలబోతున్నాయి. రైతులు ఒక్క పంటకై నా సాగునీటిని అందించి ఆదుకోండని ఆందోళనలు చేస్తున్నా పాలకుల్లో చలనం కలగడం లేదు. ఓ వైపు వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో సాగునీటి కోసం పోరాటం ఉద్ధృతం చేస్తున్నారు. సోమవారం నంద్యాలలో మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి కలెక్టరేట్‌ ముట్టడి విజయవంతమైంది. మంగళవారం వెలుగోడు రిజర్వాయర్‌ ముట్టడికి వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి పిలుపునిచ్చారు. బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో సాగునీరు విడుదల చేయాలంటూ కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. కాగా అధికారంలో ఉన్న కూటమి నేతలు మాత్రం సాగునీటి విడుదల విషయంలో మౌనం దాల్చడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తెలుగుగంగ, ఎస్సార్‌బీసీ, సిద్ధాపురం చెరువును నింపడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. జిల్లాలోని కూటమి ఎమ్మెల్యేలు బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, జయసూర్య, భూమా అఖిలప్రియ, గౌరు చరిత, మంత్రులు ఫరూక్‌, జనార్ధన్‌రెడ్డి సాగునీరు విడుదలపై నోరు మెదపకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంటలు ఎండుతున్నా పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.

జల కళ సంతరించుకున్న వీబీఆర్‌

కల్లూరు: రైతుల కళ్లు ఆకాశం వైపు చూస్తుండగా.. వారి కళ్లలో నీళ్లు ఎండుతున్న పంటలను చూస్తున్నాయి. వర్షం కోసం రైతులు పూజలు, ప్రార్థనలు చేశారు. అయినా వరుణుడు కరుణించలేదు. రైతుల మొర ఆలకించిన కృష్ణమ్మ ఎగువ నుంచి భూములను తడిపేందుకు పరుగున వచ్చి చేరింది. అయినా ఆయకట్టు కనుచూపు మేర బీళ్లుగా కనిపిస్తోంది. సాగునీటి కాల్వలు వెలవెలబోతున్నాయి. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ రైతు పక్షాన పోరాటం ఉద్ధృతం చేసింది. సాగునీటిని విడుదల చేయాలని కూటమి ప్రభుత్వం ఒత్తిడి చేస్తోంది. పార్టీ నాయకులు రైతులతో కలసి పోరుబాట పట్టారు. మంగళవారం వీబీఆర్‌ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ మేరకు రైతు శంఖారావం పేరుతో చేపట్టనున్న ఈ కార్యక్రమానికి రైతులు, ప్రజలు తరలి రావాలని వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం కల్లూరులోని కాటసాని నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అన్నదాతల కోసం ‘రైతు శంఖారావం’ కార్యక్రమం తలపెట్టగా గత నాలుగు రోజులుగా ప్రభుత్వం నోటీసులు ఇస్తూ రైతులను భయభ్రాంతులకు గురి చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. రైతులు, ట్రాక్టర్ల యజమానులు, వైఎస్సార్‌సీపీ నాయకులకు నోటీసులు ఇస్తున్నారన్నారు. జెండాలు, అజెండాలను పక్కన పెట్టి రైతాంగం తరఫున పోరాటం చేయా ల్సిన అవసరం ఉందన్నారు. రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో వీబీఆర్‌ ముట్టడి కార్యక్రమం చేస్తున్నామన్నారు.

గురుశిశ్యుల ఒప్పందంతో సీమలో కరువు..

అడ్డగోలుగా తెలంగాణ ప్రభుత్వం జలదోపిడీ చేస్తుంటే కూటమి ప్రభుత్వం, టీడీపీ నాయకులు ఏ మాత్రం చలించడం లేదని కాటసాని, శిల్పా విమర్శించారు. గురుశిశ్యుల ఒప్పందంతో రాయలసీమలో కరువు ఛాయలు కనిపిస్తున్నాయన్నారు. శ్రీశైలం ప్రాజెక్టులోకి వచ్చిన జలాలను సక్రమంగా వినియోగించుకుంటే కనీసం ఒక పంటైనా పండించుకునే వాళ్లమన్నారు.

సాగునీటి ప్రాజెక్టులు, రిజర్వాయర్‌లపై టీడీపీ నాయకులకు అవగాహన లేదన్నారు. 1995 నుంచి 2004 వరకు తొమ్మిదేళ్లు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాయలసీమకు ఏం చేశారో ప్రజలకు వివరించాలన్నారు. గోరుకల్లు రిజర్వాయర్‌పై గత చరిత్ర తెలుకుని టీడీపీ నాయకులు మాట్లా డాలన్నారు. సమావేశంలో మాజీ మేయర్‌ బీవై రామ య్య పాణ్యం నియోజకవర్గ పరిశీలకులు సూర్యప్రకా ష్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు అక్కిమి హనుమంతురెడ్డి, శివారెడ్డి, మహేశ్వర్‌రెడ్డి, శ్రీనివాసులు యాద వ్‌, రమణారెడ్డి, గోపాల్‌రెడ్డి, తాజా మాజీ కార్పొరేటర్లు సాన శ్రీనివాసులు, దండు లక్ష్మీకాంతరెడ్డి, విక్రమసింహరెడ్డి, ఎరుకల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

కూటమి ప్రభుత్వ తీరుతోనే కరువు

చంద్రబాబు రాయలసీమకు

ఏం చేశారో చెప్పాలి

తెలంగాణ జలదోపిడీని అడ్డుకోవాలి

వీబీఆర్‌ ముట్టడిని అడ్డుకోలేరు

పోలీసు నోటీసులకు

ఎవరూ భయపడరు

రైతు శంఖారావానికి తరలిరండి

వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా

అధ్యక్షులు కాటసాని రాంభూపాల్‌రెడ్డి,

మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement