రైతుల కోసం ఎందాకై నా పోరాటం | - | Sakshi
Sakshi News home page

రైతుల కోసం ఎందాకై నా పోరాటం

Sep 1 2026 1:43 AM | Updated on Sep 1 2026 1:43 AM

నంద్యాల: రైతుల సాగు నీటి హక్కు కోసం వైఎస్సార్‌సీపీ ఎందాకై నా పోరాటం చేస్తుందని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి అన్నారు. రైతులు, ప్రజలకు సాగునీరు, తాగునీరు అందించాలనే డిమాండ్‌తో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన కలెక్టరేట్‌ ముట్టడి విజయవంతమైంది. సోమవారం పట్టణంలోని నూనెపల్లె నుంచి కలెక్టర్‌ కార్యాలయం వరకు మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి, మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా, రాష్ట్ర మార్క్‌ఫెడ్‌ మాజీ చైర్మన్‌ పీపీ నాగిరెడ్డి, నంది రైతు సమైక్య అధ్యక్షుడు రామ సుబ్బారెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కౌన్సిల్‌ మెంబర్స్‌ రామలింగారెడ్డి, సాయినాథ్‌ రెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. వందలాది మంది రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరావడంతో నంద్యాల కలెక్టరేట్‌ ప్రాంగణం నినాదాలతో దద్దరిల్లింది.

రోడ్డుపై బైఠాయించి నిరసన

తాగు, సాగునీరు అందించకుండా నిద్రపోతున్న టీడీపీ ప్రభుత్వం మేల్కొనాలని, ప్రజలకు అత్యవసరమైన నీరు అందించలేని సీఎం రాజీనామా చేయాలని, శ్రీశైలంలో నీరు ఉన్నా చెరువులు, రిజర్వాయర్లు, కుంటలు ఎందుకు నింపడం లేదని ప్రభుత్వాన్ని నిలదీస్తూ కలెక్టరేట్‌ ఎదుట వైఎస్సార్‌సీపీ నేతలు, రైతులు రోడ్డుపై గంట పాటు బైఠాయించారు. దీంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచి పోయాయి. కలెక్టర్‌ బయటకు వచ్చి రైతులు, ప్రజల సమస్యలు విని నీరు ఎప్పుడు విడుదల చేస్తారో తెలపాలని భీష్మించారు. అనంతరం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ రాజకుమారిని కలిసి రైతులు, ప్రజల సమస్యలను వైఎస్సార్‌సీపీ నాయకులు వివరించారు. తాగునీటికి రెండు, మూడు రోజుల్లో నీటిని విడుదల చేస్తామని కలెక్టర్‌ రాజకుమారి హామీ ఇచ్చారు. ఆందోళనలో రాష్ట్ర రైతు విభాగం సెక్రటరీ రత్నబాబు చౌదరి, రాష్ట్ర మహిళా విభాగం జనరల్‌ సెక్రటరీ శశికళా రెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు దాల్‌మిల్‌ అమీర్‌బాషా, నంద్యాల ఎంపీపీ శెట్టి ప్రభాకర్‌, మాజీ మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్లు పురుషోత్తం రెడ్డి, విజయ శేఖర్‌ రెడ్డి, మహేశ్వరరెడ్డి, వైఎస్సార్‌సీపీ నంద్యాల మండల అధ్యక్షుడు బసవేశ్వర రెడ్డి, మాజీ మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ మాబున్నిషా, నంద్యాల జిల్లా కమిటీ సభ్యులు, ఎంపీటీసీలు, నంద్యాల, గోస్పాడు మండలాల రైతులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

అధికారులూ.. రైతుల గోడు వినండి

– శిల్పా రవి

శ్రీశైలం ప్రాజెక్ట్‌లో నీరు నిల్వ ఉన్నా.. సాగునీటికి నీరు విడుదల చేయడం లేదు. కనీసం తాగునీటికై నా నీరు ఎందుకు విడుదల చేయలేదో టీడీపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. చెరువులు, కుంటలు ఎండిపోయి, పంటలు బీళ్లువారుతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోంది. పాలకులపై నమ్మకం పోయింది. అధికారులు రైతుల కష్టాలు, కన్నీళ్లు చూసి నీటిని విడుదల చేయండి. జగన్‌ ప్రభుత్వంలో రైతులకు అన్ని రకాలుగా భరోసాగా నిలిచాం. ప్రభుత్వ వైఖరిలో మార్పు రాకపోతే పోరాటం మరింత ఉద్ధృతం చేస్తాం. కూటమి ప్రభుత్వం హామీలను విస్మరించడంతో రైతు లు, యువత, ఉద్యోగులు రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. నిత్యావసర సరుకుల ధరల నియంత్రణకు పంటలు సాగు చేయాలి. రైతులకు అవసరమైన వాటిని అందించలేని ప్రభుత్వం మద్యాన్ని మాత్రం డోర్‌ డెలివరీ చేస్తోంది’

నీటి విడుదలలో జాప్యమెందుకు?

కూటమి ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలి

మాజీ ఎమ్మెల్యే

శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి

కలెక్టరేట్‌ ముట్టడికి

తరలివచ్చిన రైతులు

రెండు మూడు రోజుల్లో

నీటి విడుదలకు కలెక్టర్‌ హామీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement