పీజీఆర్‌ఎస్‌కు 98 ఫిర్యాదులు | - | Sakshi
Sakshi News home page

పీజీఆర్‌ఎస్‌కు 98 ఫిర్యాదులు

Sep 1 2026 1:43 AM | Updated on Sep 1 2026 1:43 AM

బొమ్మలసత్రం: జిల్లా పోలీస్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అర్జీదారుల నుంచి 98 ఫిర్యాదులు అందాయి. జిల్లా ఎస్పీ సునీల్‌ షొరాణ్‌ మాట్లాడుతూ.. జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులతో నేరు గా మా ట్లాడి సమస్యలు తెలుసుకున్నామన్నా రు. క్రిమినల్‌ కేసులకు సంబంధించి నేరుగా స్టేషన్‌ అధికారులతో మాట్లాడి సమస్యను అక్కడికక్కడే పరిష్కరించామన్నారు. మరికొన్ని సమస్యలను ఆయా స్టేషన్‌ అధికారుల వద్దకు పంపి ఇరు పక్షాల వారికి న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించామన్నారు.

నేటి నుంచి ఎన్‌టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీ

నంద్యాల(న్యూటౌన్‌): జిల్లాలో ఎన్‌టీఆర్‌ భరోసా పింఛన్లు 1వ తేదీ నుంచి పంపిణీ చేస్తున్నట్లు డీఆర్‌డీఏ పీడీ శ్రీధర్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో 2,09,732 మంది పింఛన్‌ దారులకు రూ.90.87 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. పంచాయతీ కార్యదర్శులు, వీఆర్‌ఓలు, సచివాలయ ఉద్యోగులు ఉదయం 6గంటలకే వెళ్లి పింఛన్లను పంపిణీ చేయాలన్నారు. పంపిణీలో ఎలాంటి అవకతవకలు జరిగినా చర్యలు తప్పవన్నారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, అంగవైకల్యం కల వారు పింఛన్లు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

హక్కులు సాధించే

వరకు ఉద్యమం

నంద్యాల(అర్బన్‌): ప్రభుత్వ ఉద్యోగుల హక్కులను సాధించే వరకు ఏపీ జేఏసీ అమరావతి పోరాటాలు సాగిస్తుందని ఏపీ జేఏసీ అమరావతి నంద్యాల జిల్లా చైర్మన్‌ రామచంద్రారావు తెలిపారు. ఉద్యోగుల పీఆర్సీని అమలు చేసి డీఏలను వెంటనే విడుదల చేయాలని, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల క్రమబద్ధ్దీకరణ, తదితర డిమాండ్ల సాధన కోసం జిల్లాలోని వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులు సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్‌ రాజకుమారికి ఉద్యమ కార్యాచరణ నో టీసును అందజేశారు. ఈ సందర్భంగా రామచంద్రారావు మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన పెండింగ్‌ బకాయిలు విడుదల చేయాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా డీఏ బకాయిలను చెల్లించాలన్నారు. ఉద్యోగుల హక్కులు సాధించేంత వరు కు ఐక్యంగా ఉద్యమిద్దామని పిలుపునిచ్చారు. కుటుంబ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఉద్యోగి బాధ్యతగా ఉద్యమ కార్యక్రమంలో పాల్గొని ఉద్యోగుల ఐక్యతను చాటాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఏపీ జేఏసీ అమరావతి ఉమెన్‌ వింగ్‌ చైర్మన్‌ విజయకుమార్‌, అన్నమ్మ, మాధవిరెడ్డి, సరస్వతిబాయి, విజయశేఖర్‌, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement