నల్లకాల్వ ఊట చెరువులో అక్రమ తవ్వకాలు | - | Sakshi
Sakshi News home page

నల్లకాల్వ ఊట చెరువులో అక్రమ తవ్వకాలు

Jun 3 2026 1:03 AM | Updated on Jun 3 2026 1:03 AM

● టీడీపీ కార్యాలయ నిర్మాణానికి మొరుసు తరలింపు యత్నం ● అడ్డుకున్న గ్రామస్తులు

● టీడీపీ కార్యాలయ నిర్మాణానికి మొరుసు తరలింపు యత్నం ● అడ్డుకున్న గ్రామస్తులు

ఆత్మకూరురూరల్‌: నల్లకాల్వ గ్రామ ఊట చెరువులో మంగళవారం అక్రమ తవ్వకాలు జరుగుతుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు. టిప్పర్‌, ప్రొక్లెయిన్‌తో చెరువు వద్దకు చేరుకున్న వారిని యువకులు, క్రీడాకారులు అడ్డుకుని ప్రశ్నించారు. ఆత్మకూరులో నూతనంగా నిర్మిస్తున్న టీడీపీ కార్యాలయ భవనం కోసం మొరుసు తీసుకెళ్తున్నామని వారు చెప్పడంతో.. అనుమతులుంటే చూపాలని పట్టుబట్టారు. అయితే ఇంతలో గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు కొందరు అక్కడికి వచ్చి ట్రిప్పర్లు అడ్డుకుంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. అయితే చెరువులో ఒకటిన్నర అడుగుకు మించి పూడిక మన్ను తీయరాదని అది కూడా గ్రామ పంచాయతీ అనుమతి మేరకు తగిన రశీదు పొంది పంట పొలాలకు రైతులకు మాత్రమే ఆ హక్కు ఉందని గ్రామస్తులు చెప్పినప్పటికీ టీడీపీ నాయకులు దౌర్జన్యంగా మట్టి తరలించేందుకు యత్నించారు. గ్రామస్తులు మిషన్‌కు అడ్డుగా కూర్చోవడంతో వారు చేసేది లేక అధినాయకులకు సమాచారమిచ్చారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి అడ్డుకుంటే జరగబోయే ఇబ్బందులు గ్రాస్తులకు వివరించి 20 ట్రిప్పర్లు మొరుసు తీసుకు పోయేలా పంచాయితీ చేసినట్టు తెలిసింది. గ్రామానికి ఎంతో ఉపయోగకరంగా ఉన్న చెరువుపై టీడీపీ నాయకుల కన్ను పడటంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. భవిష్యత్తులో చెరువులోని మొరుసు (గ్రావెల్‌) అక్రమంగా తరలించేందుకు ఇది శాంపిల్‌ మాత్రమేనని చర్చించుకుంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement