ఆదోని జిల్లా సాధనకు అక్షర చైతన్యం
ఎమ్మిగనూరుటౌన్/నందవరం: జిల్లా పశ్చిమ ప్రాంతమైన ఆదోనిని జిల్లా చేసేందుకు గల ప్రాముఖ్యత, ప్రాంత సమస్యలను తెలియజేసేలా పట్టణానికి చెందిన తెలుగు ఉపాధ్యాయుడు కాకె వెంకటేశప్ప తన కుంచె నుండి గీసిన అక్షర చిత్రమిది. జిల్లాలోని అత్యంత వెనుకబడిన ప్రాంతమైన ఆదోని డివిజన్‌ను జిల్లా కేంద్రంగా చేయాల్సిన అవశ్యకతను తెలియజేస్తూ ఆదోని అక్షరాల్లో ఆయన పొందుపరిచిన అంశాలు విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు ఆ ప్రాంత ప్రజల్లో చైతన్యం నింపుతున్నాయి. ‘ఆ’ అక్షరంలో పశ్చిమ ప్రాంతంలోని ప్రముఖ దైవ క్షేత్రాలు, ‘దో’ అక్షరంలో ఇక్కడి ప్రముఖ వ్యక్తులు, నైసర్గిక స్వరూపాలు, ఉత్పత్తులు, ‘ని’లో ప్రాంత సమస్యలు తెలియజేసేలా చిత్రం గీశారు. ఈ చిత్రం స్థానికుల్లో ఆదోని జిల్లా సాధనకు చైతన్యం నింపుతోంది.
ఆదోని జిల్లా సాధనకు అక్షర చైతన్యం


