ఉప్పొంగిన భక్తి భావం
ఎమ్మిగనూరుటౌన్: పట్టణంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రథోత్సవం కనుల పండువగా సాగింది. శుక్రవారం తమిళ భక్తులతో పాటు స్థానికులు పాత ఆంజినేయ స్వామి ఆలయంలోని శమీవృక్షం నుంచి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం వరకు రథోత్సవాన్ని నిర్వహించారు. తమిళ భక్తులు కావళ్లతో, నోటికి శూలాలు గుచ్చుకుని రథోత్సవంలో పాల్గొన్నారు. వీపునకు కొక్కాలు గుచ్చుకుని రథాన్ని లాగి భక్తిని చాటారు. మధ్యాహ్నం స్వామి వారికి అభిషేకం, భస్మపూజ, మహామంగళ హారతి, సహస్త్ర పుష్పార్చన, ప్రసాద వినినియోగ కార్యక్రమాలతో పూజా కార్యక్రమాలు చేశారు. సాయంత్రం స్వామి వారి పల్లకీ సేవతో ఊరేగింపు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త యూజీ కేశవర్ధన ఆధ్వ ర్యంలో నిర్వహించిన ఈ రథోత్సవంలో కార్యనిర్వాహ కులు, తమిళ భక్తులు,పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఉప్పొంగిన భక్తి భావం
ఉప్పొంగిన భక్తి భావం
ఉప్పొంగిన భక్తి భావం


