ఎస్‌ఎల్‌బీసీ, డిండి | - | Sakshi
Sakshi News home page

ఎస్‌ఎల్‌బీసీ, డిండి

Jun 29 2026 1:59 AM | Updated on Jun 29 2026 1:59 AM

ప్రాజెక్టులు పూర్తిచేసి నీళ్లు పారిస్తాం : సీఎం రేవంత్‌రెడ్డి

వచ్చే ఎన్నికల

నాటికి..

నల్లగొండ : ఎస్‌ఎల్‌బీసీ, డిండి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఎస్‌ఎల్‌బీసీ సొరంగ మార్గాన్ని వచ్చే ఎన్నికల నాటికి పూర్తి చేసి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. ఆ బాధ్యత భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఆర్థిక మంత్రి చూస్తారన్నారు. ఆదివారం నల్లగొండ జిల్లా కనగల్‌ మండల కేంద్రంలో రూ.13 వేల కోట్లతో చేపట్టిన హ్యామ్‌ రోడ్ల పథకానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం నల్లగొండలోని ఎన్జీ కళాశాల బహిరంగ సభ ప్రాంగణం వద్ద రూ.83 కోట్లతో మంచి నీటి పథకానికి శంకుస్థాపన చేశారు. అనంతరం సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఎస్‌ఎల్‌బీసీ పూర్తిచేసి కృష్ణాజలాలను నల్లగొండ గడ్డపై పారిస్తానని, ప్రతి ఎకరాకు సాగునీరు అందించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. డిండి ప్రాజెక్టును కూడా పూర్తి చేస్తామని పేర్కొన్నారు. మూసీ కంపు, కాలుష్యం నుంచి జిల్లా ప్రజలకు విముక్తి కల్పిస్తానని చెప్పారు. మూసీ కంపు వల్ల జిల్లాలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

మా ప్రభుత్వం ఎందుకు పోవాలి

‘నేను నడుచుకుంటూ వస్తున్న సమయంలో కొందరు యువకులు నాకు ఇలా చెప్పారు. సూర్యాపేటలో తులసివనంలో గంజాయి మొక్క ఉందన్న. ఆ మూడు జానలాయన కోమటిరెడ్డిని విమర్శిస్తుండు. ఈ సారి ఆ గంజాయి మొక్కను గెలువనివ్వమని నాకు చెప్పారు. నేను కూడా మీకు చెబుతున్నా ఆ ఒక్క మొక్కను కూడా పీకేయాలి’ అని సీఎం పిలుపునిచ్చారు. ‘ప్రజాపాలన పోవాలని బీఆర్‌ఎస్‌ నేతలు అంటున్నారు. మా ఆడపడుచులంతా.. కళ్ల సంబురంగా నేను పెట్టిన చీరనుకట్టుకుని వచ్చిండ్రు. నేను అడుగుతున్నా.. వడ్డీలేని రుణాలు ఇచ్చినందుకు ప్రజా ప్రభుత్వం పోవాల్నా.. గ్యాస్‌, సన్న బియ్యం, రైతుభరోసా వంటి సంక్షేమ పథకాలు ఇచ్చినందుకు మా ప్రభుత్వం పోవాల్నా’ అంటూ ముఖ్యమంత్రి వేదిక నుంచి ప్రశ్నించారు.

మూసీ కాలుష్యం నుంచి

నల్లగొండకు విముక్తి కల్పిస్తాం

సంక్షేమ పథకాలు ఇస్తున్నందుకు

మా ప్రభుత్వం పోవాల్నా

నల్లగొండ బహిరంగ సభలో

ముఖ్యమంత్రి

హ్యామ్‌ రోడ్ల పైలాన్‌ ఆవిష్కరణ

కనగల్‌ : కనగల్‌ మండల కేంద్రంలోని సబ్‌ మార్కెట్‌ యార్డ్‌ వద్ద సీఎం రేవంత్‌రెడ్డి.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌తో కలిసి హ్యామ్‌ రోడ్ల పైలాన్‌ను ఆవిష్కరించారు. రూ.13,006.27 కోట్ల అంచనా వ్యయంతో మొత్తం 6,092.37 కిలోమీటర్ల పరిధిలో 441 రహదారులను విస్తరించి, పటిష్టపరచేందుకు ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్ట్‌ పూర్తయితే రవాణా వ్యవస్థ మరింత మెరుగుపడనుందని సీఎంతో పాటు మంత్రులు వెల్లడించారు. మెరుగైన రహదారుల నిర్మాణం ప్రాంతీయ అభివృద్ధికి దోహదపడటమే కాకుండా వాణిజ్య, వ్యవసాయ రంగాల పురోగతికి ఊతమిస్తుందని చెప్పారు. ప్రజలకు సురక్షితమైన, వేగవంతమైన ప్రయాణ సౌకర్యం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement