సీఎం సెక్యూరిటీ, కాంగ్రెస్‌ నేతల తోపులాట | - | Sakshi
Sakshi News home page

సీఎం సెక్యూరిటీ, కాంగ్రెస్‌ నేతల తోపులాట

Jun 29 2026 1:59 AM | Updated on Jun 29 2026 1:59 AM

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగం ముగిసిన తరువాత మహిళా సంఘాలకు రుణాల చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం వేదికపైనే సీఎంను సన్మానించారు. ఇదే సమయంలో మాజీ మున్సిపల్‌ చైర్మన్‌, మేయర్‌ బుర్రి చైతన్య భర్త శ్రీనివాస్‌రెడ్డితో పాటు పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు గుమ్మల మోహనన్‌రెడ్డి తదితరులు ముఖ్యమంత్రిని సన్మానించేందుకు వెళుతుండగా సీఎం సెక్యురిటీ సిబ్బంది అడ్డుకున్నారు. పలుమార్లు వెళ్లేందుకు ప్రయత్నించినా వారిని అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. ఇదే క్రమంలో నేతలను సెక్యూరిటీ సిబ్బంది నెట్టివేయడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. సీఎం పర్యటనలో ముఖ్యమైన నాయకులకు ఇలా జరగడం చర్చనీయాంశమైంది.

ప్రకటనల్లో ఫొటోలపై నారాజ్‌..

సీఎం రేవంత్‌రెడ్డి నల్లగొండ జిల్లా పర్యటన సందర్భంగా రోడ్లు భవనాల శాఖ జారీ చేసిన ప్రకటనల్లో ఫొటోలపై కొందరు నేతలు అసంతృప్తిగా ఉన్నట్లు తెలిసింది. ప్రొటోకాల్‌ ప్రకారం జిల్లాకు చెందిన, శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు శంకర్‌నాయక్‌, నెల్లికంటి సత్యం ఫొటోలను వేయలేదు. దీంతో గుత్తా సుఖేందరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. సంబంధిత అఽధికారులకు అధికారులకు నోటీసులు ఇచ్చే యోచనలో ఆయన ఉన్నట్లు తెలిసింది. మరోవైపు సీఎం పర్యటనకు జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు పున్న కై లాష్‌ నేతకు ఆహ్వానం అందకపోవడం, మంత్రి అనుచరులు ఏర్పాటు చేసిన స్వాగత ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లలోనూ డీసీసీ అధ్యక్షుడి హోదాలో కైలాష్‌ నేత ఫొటోలు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement