గుండ్రాంపల్లి శివారులో జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.
- 8లో
ధాన్యం దిగుబడిలో రాష్ట్రంలోనే నల్లగొండ జిల్లా మొదటి స్థానంలో ఉందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. దేశంలో ధాన్యం దిగుమతి కొనుగోళ్లలో తెలంగాణ ముందుంటే.. తెలంగాణలో నల్లగొండ జిల్లా ముందుందన్నారు. జిల్లాలో కొత్తగా 75 వేల రేషన్ కార్డులు మంజూరు చేశామన్నారు. ఏఎమ్మార్పీ, సాగర్ కాల్వల ఆదునీకరణ పనులు చేపట్టామన్నారు. నా జీవితంలో ఇంత పెద్ద రోడ్ల ప్రాజెక్టు ఎక్కడా ఒకేసారి చేపట్టిన దాఖలాలు లేవన్నారు.
జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉంటే వారి నియోజకవర్గంలో అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నారని నల్లగొండ ఎంపీ రఘువీర్‌రెడ్డి అన్నారు. తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని మిగతా నియోజకవర్గాల అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి ఆలోచించి నిధులు మంజూరు చేయాలని కోరారు. సాగర్ నియోజకవర్గంలో హైలెవల్, లోలెవల్ కెనాల్ పూర్తిచేసి లింక్ కలపాలని, డిండి, ఎదుల్ల ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ వేగవంతం చేయాలన్నారు. మిర్యాలగూడ నియోజక వర్గ పరిధిలోని నాలుగు ఎత్తిపోతల పథకాలను త్వరగా పూర్తి చేయాలన్నారు.


