మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు నివాళి | - | Sakshi
Sakshi News home page

మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు నివాళి

Jun 29 2026 1:59 AM | Updated on Jun 29 2026 1:59 AM

పీవీ విగ్రహానికి నివాళులర్పిస్తున్న భూపాల్‌రెడ్డి, పీవీ నర్సింహారావు అభిమానులు

నల్లగొండ టౌన్‌ : భారత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి ఆదివారం నల్లగొండ పట్టణంలో పీవీ అభిమానులు, బీఆర్‌ఎస్‌ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పీవీ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. పీవీ జయంతిని కాంగ్రెస్‌ ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయ మన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ మందడి సైదిరెడ్డి, బోనగిరి దేవేందర్‌, కార్పొరేటర్‌ రమేష్‌, ఏవీఎల్‌ నర్సింహారావు, చకిలం సంధ్యారాణి, చకిలం వేణుగోపాలరావు, కంచనపల్లి రవీందర్‌రావు, రాజేష్‌, పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement