వాతావరణం | - | Sakshi
Sakshi News home page

వాతావరణం

Jun 29 2026 1:59 AM | Updated on Jun 29 2026 1:59 AM

సొరంగం పూర్తయితే నాలుగు లక్షల ఎకరాలకు నీరు

పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉంది.

మూసీ కాలుష్యంతో ఇబ్బందుల్లో ఉన్న మన జీవితాలను మార్చేందుకు సీఎం రేవంత్‌రెడ్డి మూసీ ప్రక్షాళనకు పూనుకున్నాడని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. మూసీ ప్రక్షాళనను అడ్డుకోవాలని బీఆర్‌ఎస్‌ నేతలు చూస్తున్నారని, ‘కేసీఆర్‌, కేటీఆర్‌ మీరు ఒకసారి నకిరేకల్‌ ప్రాంతంలో రాత్రి నిద్రపోయి చూడండి, ఇక్కడి ప్రజలు దోమలతో, మూసీ కంపుతో ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో అర్థమవుతుందన్నారు. కుర్చీ వేసుకుని కూర్చొని ఎస్‌ఎల్‌బీసీ పూర్తి చేయిస్తానని కేసీఆర్‌ ఎన్నికల్లో ప్రకటించి ఒక్కసారి కూడా అక్కడికి పోలేదన్నారు. సొరంగం పూర్తయితే 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు ఫ్లోరైడ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన రెండున్నరేళ్లలో నల్లగొండలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు సాగుతున్నాయన్నారు. నల్లగొండను కార్పొరేషన్‌ చేసినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. నగరంలో అండర్‌గ్రౌండ్‌ డ్రెయినేజీకి మరో రూ.400 కోట్లు, షాదీఖానా నిర్మాణానికి, సొరంగ మార్గానికి మరో రూ.500 కోట్లు మంజూరు చేయాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement