నల్లగొండ : ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని కోరుతూ గురువారం కలెక్టరేట్ ఎదుట టీఎస్‌యూటీఎఫ్ ఆద్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరారు. అశాసీ్త్రయమైన ఎన్‌ఈపీ 2020ని రద్దు చేయాలని, పాఠశాలల మూసివేతను ఆపివేయాలని డిమాండ్ చేశారు. అవసరం ఉన్న చోట నూతన పాఠశాలలను తెరవాలని, విద్యాహక్కు చట్టానికి సవరణ చేసి సర్వీస్‌లో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని, ఉపాధ్యాయులు బోధించే సబ్జెక్టులో పరీక్ష నిర్వహించాలని కోరారు. రాష్ట్ర కార్యదర్శి పెరుమాళ్ల వెంకటేశం మాట్లాడుతూ సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను పునరుద్ధరిచాలని, పీఆర్సీకి రిపోర్ట్ తెప్పించుకుని వెంటనే అమలు చేయాలని, పెండింగ్ డీఏలను విడుదల చేయాలని కోరారు. అనంతరం డీఆర్‌ఓ దశరథకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బక్కా శ్రీనివాసచారి, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎడ్ల సైదులు, నల్ల నరసింహ, జి.నాగమణి, నర్రా శేఖర్‌రెడ్డి, జి.అరుణ, వడ్త్యా రాజు, గేర నరసింహ, శ్రీనివాస్‌రెడ్డి, రమాదేవి, నలపరాజు వెంకన్న, యాదగిరి, చిన వెంకన్న, కొమర్రాజు సైదులు, గంటల వెంకట్, భాను ప్రకాష్, నరసింహమూర్తి, వరలక్ష్మి, సురేందర్ రెడ్డి పాల్గొన్నారు.


