జూలై 22న ఎన్జీ కళాశాల స్నాతకోత్సవం | - | Sakshi
Sakshi News home page

జూలై 22న ఎన్జీ కళాశాల స్నాతకోత్సవం

Jun 25 2026 9:33 AM | Updated on Jun 25 2026 9:33 AM

రామగిరి(నల్లగొండ) : నల్లగొండలోని నాగార్జున కళాశాల (ఎన్జీ) స్నాతకోత్సవాన్ని జూలై 22న నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ సముద్రాల ఉపేందర్‌ తెలిపారు. 2025–26 విద్యా సంవత్సరంలో డిగ్రీ, 2024–25 విద్యా సంవత్సరంలో పీజీ పూర్తి చేసిన విద్యార్థులు ఈ స్నాతకోత్సవానికి అర్హులని పేర్కొన్నారు. అర్హులైన విద్యార్థులు కళాశాలకు వచ్చి, నిర్ణీత ఫీజును చెల్లించి స్నాతకోత్సవానికి దరఖాస్తు చేసుకోవాలని పరీక్షల నియంత్రణాధికారి డి.మునిస్వామి తెలిపారు. స్నాతకోత్సవానికి అర్హులైన విద్యార్థుల జాబితా ఇతర పూర్తి వివరాలు కళాశాల అధికారిక వెబ్‌సైట్‌ nfco efe na go nd-a.ac.i n లో చూడవచ్చని తెలిపారు. ఇతర వివరాలకు 9550636464 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

మా ఊరికి ప్రైవేట్‌ స్కూల్‌ బస్సులు రావొద్దు

చండూరు : చండూరు మండలపరిదిలోని పుల్లెంల గ్రామంలోకి ప్రైవేట్‌ స్కూల్‌ బస్సులు రావొద్దని గ్రామస్తులు బుధవారం అడ్డుకున్నారు. బుధవారం గ్రామానికి వచ్చిన స్కూల్‌ బస్సులను సర్పంచ్‌, ఉపసర్పంచ్‌ ఆధ్వర్యంలో గ్రామస్తులు తిప్పి పంపారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలకే పిల్లలను పంపుతామని చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్‌ ముక్కాముల వెంకన్న, ఉప సర్పంచ్‌ ఊషయ్య, బొడ్డు సైదులు తదితరులు పాల్గొన్నారు.

నేడు మూసీ

మత్స్య సంఘం ఎన్నికలు

నకిరేకల్‌ : నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో వేలాది మంది మత్స్య కార్మికులకు జీవనోపాధి కల్పిస్తున్న మూసీ ప్రాజెక్టు మత్స్య పారిశ్రామిక మార్కెంటింగ్‌ సహకార సొసైటీ ఎన్నికలు గురువారం జరగనున్నాయి. ఈ ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సొసైటీకి చివరగా 2012లో ఎన్నికలు జరిగాయి. ఆ పాలకవర్గం గడువు 2017లో ముగిసింది. నాటి నుంచి ఎన్నికలు నిర్వహించలేదు. తొమ్మిదేళ్ల తర్వాత ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 13 డైరెక్టర్‌ పదవులకు గాను 43 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈ సంఘం పరిధిలో నకిరేకల్‌, శాలిగౌరారం, కేతేపల్లి, జాజిరెడ్డి గూడెం, సూర్యాపేట మండలాల్లోని 12 గ్రామాల్లో 3,557 మంది మత్స్యకారులు ఓటర్లుగా ఉన్నారు. గురువారం నకిరేకల్‌ మండలం ఓగోడు గ్రామంలోని ఓ పంక్షన్‌ హాల్‌లో పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2.30గంటల వరకు బ్యాలెట్‌ పద్ధతిన పోలింగ్‌ నిర్వహించి.. ఆ తర్వాత ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నారు.

యాదగిరి క్షేత్రంలో

సంప్రదాయ పూజలు

యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో సంప్రదాయ పూజలు కొనసాగాయి. బుధవారం వేకువ జామునే ఆలయాన్ని తెరచిన అర్చకులు శ్రీస్వామి అమ్మవార్లకు సుప్రభాతం జరిపించారు. అనంతరం స్వయంభూ, ప్రతిష్ఠా అలం కారమూర్తులకు నిజాభిషేకం, తులసీ దళాలతో అర్చన, ఆరాధన, బాల భోగం, సహస్ర నామార్చన వంటి పూజలు చేపట్టారు. ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం నిర్వహించారు. సాయంత్రం ఆలయ తిరు, మాడ వీధుల్లో జోడు సేవలను ఊరేగించారు. వివిధ పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.

ప్రజాభిప్రాయం ప్రకారమే నిర్ణయం తీసుకుంటాం

తుర్కపల్లి: ఇండస్ట్రీ ఏర్పాటు విషయంలో ప్రజాభిప్రాయం మేరకే నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి నల్లగొండ ప్రాంతీయ అధికారి వెంకన్న, ఆర్డీఓ కృష్ణారెడ్డి తెలిపారు. తుర్కపల్లి మండలం మాదాపూర్‌లో ఎన్‌సీఎల్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ ఏర్పాటుపై బుధవారం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. కంపెనీ ఏర్పాటుపై గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సర్పంచ్‌ సీతారాజు మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పర్యావరణ పరిరక్షణకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement