కనగల్ : వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులు నీటి అవసరం తక్కువగా ఉండే పంటలను సాగు చేయాలని కలెక్టర్ చంద్రశేఖర్ సూచించారు. మంగళవారం కనగల్ రైతు వేదికలో నిర్వహించిన విత్తనమేళాను ఆయన ప్రారంభించి మాట్లాడారు. సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి దిగుబడులు పొందవచ్చని తెలిపారు. ఎలాంటి పంటలు వేసుకోవాలి, ఎలాంటి విత్తనాలు వాడాలి తదితర అంశాలపై వ్యవసాయ అధికారుల సలహాలను తీసుకోవాలన్నారు. రైతులకు అవసరమైన యూరియాను సకాలంలో అందింస్తామన్నారు. అనంతరం కనగల్‌లోని మార్కెట్ యార్డ్ సమీపంలో సీఎం శంకుస్థాపన చేయనున్న హ్యాం రోడ్ల పైలాన్ పనులను పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి వినోద్‌కుమార్, ఏఓ అమరేందర్‌గౌడ్, గోలి జాగల్‌రెడ్డి, సర్పంచ్ మురళీధర్‌గౌడ్, తహసీల్దార్ పద్మ పాల్గొన్నారు.


