నల్లగొండ : భరోసా కేంద్రాల సేవలు మరింత బలోపేతం కావాలని ఎస్పీ శరత్‌చంద్ర పవార్ అన్నారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయం, భరోసా కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళలు, చిన్నారులపై జరిగే హింస, వేధింపులు, లైంగిక దాడుల కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. జిల్లాలో 2021 నుంచి 2026 వరకు పోక్సో, అత్యాచారం, మహిళలు, చిన్నారులపై జరిగిన నేరాలకు సంబంధించి మొత్తం 806 కేసులు నమోదయ్యాయని, 16 కేసుల్లో నిందితులకు శిక్షలు ఖరారయ్యాయని, బాధితులకు రూ.1.68 కోట్లకు పైగా పరిహారం అందించినట్లు వివరించారు. సమావేశంలో ఫోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి విశ్వనాథ్ కులకర్ణి, ఎకై ్సజ్ కోర్టు జడ్జి సాయి మేఘన, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ కృష్ణయ్య, పీపీ రంజిత్‌కుమార్, సీఐ మంజుల, భరోసా ఇన్‌చార్జి ఎస్‌ఐ అమ్రిన్, కోఆర్డినేటర్ నళిని తదితరులు పాల్గొన్నారు.


