కనగల్ : ధర్వేశిపురం (పర్వతగిరి) శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయ బ్రహ్మోత్సవాల్లో బాగంగా రేణుకా ఎల్లమ్మ జమదగ్ని మహామునిల కల్యాణ మహోత్సవం బుధవారం వైభవంగా సాగనుంది. కల్యాణోత్సవానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దంపతులు హాజరై అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు మంగళవారం సుప్రభాత సేవ, లలిత సహస్రనామార్చన, బాల భోగ నివేదన పూజలు నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు ఎదుర్కోలు మహోత్సవం వైభవంగా సాగింది.
కల్యాణానికి ఏర్పాట్లు పూర్తి
అమ్మవారి కల్యాణ మహోత్సవం నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఆలయం వద్ద చలువ పందిళ్లు వేశారు. తాగునీటి సౌకర్యం, భక్తుల సౌకర్యార్థం కుర్చీలు ఏర్పాటు చేశారు. కల్యాణం అనంతరం భక్తుల అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. 25న గురువారం ఆలయం వద్ద 108 కళాశాలతో అష్టోత్తర శతకటాభిషేక మహోత్సవంతో పాటు ధర్వేశిపురం, పర్వతగిరి గ్రామాల్లో బోనాల కార్యక్రమం ఘనంగా నిర్వహించనున్నారు. పూజల్లో పూజల్లో ఆలయ చైర్మన్ చీదేటి వెంకట్‌రెడ్డి దంపతులు, ఈఓ అంబటి నాగిరెడ్డి, ఏసీకే భాస్కర్, సర్పంచ్ రాయల శేఖర్, మాజీ చైర్మన్లు కంచకుంట్ల గోపాల్‌రెడ్డి, ముత్తయ్య, కార్యదర్శులు పద్మ, రాజేందర్‌రెడ్డి, ముఖ్య అర్చకులు మల్లాచారి, శ్రవణ్‌కుమారాచార్యులు, ఉమామహేశ్వరరావు, దామోదర్‌రావు, శ్రీనివాసచారి, ఫణి కుమార్, సీనియర్ అసిస్టెంట్ నాగేశ్వరరావు, జూనియర్ అసిస్టెంట్లు ఉపేందర్‌రెడ్డి, ఆంజనేయులు, రాజయ్య, శ్రీకర్, రవి, నాగరాజు పాల్గొన్నారు.
ఫ పట్టు వస్త్రాలు సమర్పించనున్న మంత్రి కోమటిరెడ్డి దంపతులు
ఫ దర్వేశిపురం ఆలయ బ్రహ్మోత్సవాలు ప్రారంభం


