వ్యవసాయానికి నిరంతర విద్యుత్‌ | - | Sakshi
Sakshi News home page

వ్యవసాయానికి నిరంతర విద్యుత్‌

Jun 24 2026 1:29 AM | Updated on Jun 24 2026 1:29 AM

నల్లగొండ : వ్యవసాయ రంగానికి నాణ్యమైన నిరంతర విద్యుత్‌ సరఫరా చేయాలని టీజీఎస్పీడీసీఎల్‌ సీఎండీ జితేష్‌ వి.పాటిల్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం నల్లగొండలోని విద్యుత్‌ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి విద్యుత్‌ శాఖ అధికారులతో నల్లగొండ సర్కిల్‌ పరిధిలోని టి–కోడ్‌ వారీ అంచనాలు, అభివృద్ధి పనుల పురోగతి, అమలు స్థితి, పెండింగ్‌లో ఉన్న పనులపై సమగ్రంగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేలా కాలిపోయిన, పనిచేయని విద్యుత్‌ మీటర్లను తక్షణమే మార్చాలని అధికారులను ఆదేశించారు. 2023–24, 2024–25 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన అసంపూర్తి పనుల పురోగతిని పరిశీలించిన సీఎండీ, వాటి పూర్తి కోసం అవసరమైన నిధులు, సామగ్రి అవసరాలపై చర్చించారు. అలాగే 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కొత్త అంచనాలు, బడ్జెట్‌ ప్రతిపాదనలు, చేపట్టనున్న అభివద్ధి పనులపై సమీక్షించారు. వర్షాకాలంలో విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలు తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు. సమావేశంలో డైరెక్టర్‌ (ఆపరేషన్స్‌) ఎన్‌.నరసింహులు, చీఫ్‌ ఇంజనీర్‌ (రూరల్‌ జోన్‌) బాలస్వామి, ఎస్‌ఈ (ఆపరేషన్స్‌)నల్లగొండ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

సీఎండీకి వినతి

టీజీఎస్పీడీసీఎల్‌ సీఎండీ జితేష్‌ వి.పాటిల్‌ను మంగళవారం విద్యుత్‌ కాంట్రాక్టర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు కలిసి పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. జిల్లా విద్యుత్‌ శాఖ స్టోర్లలో అవసరమైన సామగ్రి అందుబాటులో లేకపోవడం వల్ల పనుల నిర్వహణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అసోసియేషన్‌ సభ్యులు పేర్కొన్నారు. కార్యక్రమంలో విద్యుత్‌ కాంట్రాక్టర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర కార్యదర్శి ఎన్‌.పర్వతాలు, జిల్లా అధ్యక్షుడు ఎస్‌కే మొహిజ్‌, లింగస్వామి పాల్గొన్నారు.

ఫ టీజీ ఎస్పీడీసీఎల్‌ సీఎండీ జితేష్‌ వి.పాటిల్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement