వైటీపీఎస్‌ను ప్రైవేటీకరిస్తే సమ్మెబాట పడతాం | - | Sakshi
Sakshi News home page

వైటీపీఎస్‌ను ప్రైవేటీకరిస్తే సమ్మెబాట పడతాం

Jun 24 2026 1:29 AM | Updated on Jun 24 2026 1:29 AM

మిర్యాలగూడ : దామరచర్లలోని యాదాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (వైటీపీఎస్‌)లోని ఏ విభాగాన్నీ ప్రైవేటీకరణ చేయవద్దని ప్లాంట్‌ ఉద్యోగులు డిమాండ్‌ చేశారు. ఒకవేళ యాజమాన్యం మొండిగా ముందుకు వెళితే రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్‌ ఉద్యోగులంతా ఆందోళనలు నిర్వహించి సమ్మె బాట పడతామని హెచ్చరించారు. వైటీపీఎస్‌ వద్ద మంగళవారం ఉద్యోగులు నల్లబ్యాడ్జిలు ధరించి భోజన విరామ సమయంలో నినాదాలు చేశారు. టీజీ జెన్‌కో ఉద్యోగుల రేషనలైజేషన్‌ను అమలు చేస్తూ, త్వరితగతిన వైటీపీఎస్‌ ప్లాంట్‌కు అవసరమైన ఉద్యోగులను కేటాయించాలని కోరారు. సీహెచ్‌పీ, ఏహెచ్‌పీ టెండర్లను వెంటనే రద్దు చేయాలన్నారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement