రామగిరి (నల్లగొండ): కక్షిదారులు లోక్‌అదాలత్‌ను ఉపయోగించుకుంటే సమయం, డబ్బులు ఆదా అవుతాయని జిల్లా జడ్జి పి.వసంత్ అన్నారు. న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లో 17వ జాతీయ లోక్ అదాలత్‌లు నిర్వహించారు. ఈ సందర్భంగా నల్లగొండలో నిర్వహించిన లోక్‌అదాలత్‌కు జిల్లా జడ్జి హాజరై మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన లోక్ అదాలత్‌ల్లో మొత్తం 11,233 కేసులు (21 సివిల్, 4,196 క్రిమినల్, 69 మోటార్ వాహన ప్రమాద బీమా కేసులు, 6,890 ట్రాఫిక్ చలాన్ కేసులు, 34 బ్యాంకు రికవరీ కేసులు, 5 ఎలక్ట్రిసిటీ, 45 సైబర్ క్రైమ్) పరిష్కారమయ్యాయన్నారు. ప్రమాద బీమా కేసుల్లో రూ.3,15,73,000 నష్టపరిహారం ఇప్పించగా.. బ్యాంకు రికవరీ రూ.35,85,300, ట్రాఫిక్ చలాన్ రూ.20,31,300, ఎలక్ట్రిసిటీ రూ.16000, సైబర్ క్రైమ్ కేసుల్లో బాధితులకు రూ.3,72,138 రికవరీ డబ్బులు ఇప్పించామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సీనియర్ సివిల్ జడ్జి పి.పురుషోత్తంరావు, అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు సతీష్ కుమార్, బి.అశోక్‌కుమార్, న్యాయవాదులు, బ్యాంకు అధికారులు, కక్షిదారులు పాల్గొన్నారు.
ఫ జిల్లా జడ్జి వసంత్


