‘నీట్‌’ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు | - | Sakshi
Sakshi News home page

‘నీట్‌’ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు

Jun 21 2026 7:52 AM | Updated on Jun 21 2026 7:52 AM

నల్లగొండ : ఈ నెల 21న నీట్‌–2026 రీఎగ్జామినేషన్‌ను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు నల్లగొండ అదనపు ఎస్పీ రమేష్‌ తెలిపారు. శనివారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఏర్పాటు చేసిన ఏడు పరీక్ష కేంద్రాల వద్ద భద్రతా లోపాలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని పోలీసు అధికారులు, సిబ్బందికి సూచించారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా ఏర్పాటు చేయడంతో పాటు సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ నిర్వహించనున్నామని తెలిపారు. అభ్యర్థులు ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని, మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత అనుమతించబోమన్నారు. సమావేశంలో డీఎస్పీ కె.శివరాంరెడ్డి, టూటౌన్‌ సీఐ రాఘవరావు, వన్‌టౌన్‌ సీఐ రాజశేఖర్‌రెడ్డి, ట్రాఫిక్‌ సీఐ మహాలక్ష్మయ్య, నార్కట్‌పల్లి సీఐ సురేష్‌ పాల్గొన్నారు.

ఫ అదనపు ఎస్పీ రమేష్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement