ఫ ఏఈడీపీ పేరుతో వచ్చే ఏడాది నుంచి అందుబాటులోకి..
ఫ నల్లగొండలోని ఎన్జీ, ప్రభుత్వ
మహిళా డిగ్రీ కళాశాలల్లో ప్రారంభం
ఫ ఒక్కో కళాశాలలో మూడు కోర్సు..
ఒక్కో దాంట్లో 60 సీట్లు
రామగిరి (నల్లగొండ) : విద్యారంగంలో నూతన విద్యాప్రమాణాలు పెంచే దిశగా అడుగులు పడుతున్నాయి. వచ్చే 2026–27 విద్యా సంవత్సరంలో నల్లగొండ జిల్లా కేంద్రంలోని నాగార్జున ప్రభుత్వ (ఎన్జీ), ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల్లో డిగ్రీలో అత్యాధునిక అప్రెంటిషిప్ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రామ్స్(ఏఈడీపీ) కోర్సులను ప్రారంభించేందుకు కార్యాచరణ సిద్ధమైంది. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం, తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకత్వంలో ప్రారంభమవుతున్న ఈ ప్రత్యేక కోర్సులు విద్యార్థులకు విద్యతోపాటు పరిశ్రమ అనుభవాన్ని సమాంతరంగా అందించే వినూత్న కార్యక్రమంగా నిలువనున్నాయని విద్యావేత్తలు అంటున్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు విద్యార్థులు డిగ్రీ చదువుతో పాటు పరిశ్రమలలో ప్రత్యక్ష శిక్షణ పొందుతూ, ఉద్యోగ మార్కెట్ అవసరాలకు అనుగుణమైన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంది. ప్రతి కోర్సులో 60 సీట్లు అందుబాటులో ఉండగా, అడ్మిషన్లు తెలంగాణ ప్రభుత్వ ఈౖ ఖీ పోర్టల్ ద్వారా నిర్వహించనున్నారు. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన విద్యార్థులకు సంబంధిత సైన్స్, కామర్స్ కోర్సులు అత్యుత్తమ అవకాశాలను అందించనున్నాయి.
ఎన్జీ కాలేజీలో ప్రారంభించే
ఏఈడీపీ కోర్సులు ఇవే..
ఫ బీఎస్సీ ఈ అండ్ మొబిలిటీ అండ్ బాటరీ
ఫ బీఎస్సీ ఫార్మాక్యుటిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ క్వాలిటీ
ఫ బీకామ్ బ్యాంకింగ్, పైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ (బీఎఫ్‌ఎస్‌ఐ)
ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీలో..
● బీకామ్ బ్యాంకింగ్, పైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ (బీఎఫ్‌ఎస్‌ఐ)
● బీఎస్సీ హెల్త్‌కేర్ మేనేజ్‌మెంట్
● బీఎస్సీ ఫార్మాక్యుటిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్
అండ్ క్వాలిటీ.


