కిటికీలకు తలుపుల్లేవు..
కేతేపల్లి : కేతేపల్లిలోని ఎస్పీ హాస్టల్‌లో రికార్డు ప్రకారం మొత్తం 60 మంది విద్యార్థులకుగాను శుక్రవారం రాత్రి 32 మంది ఉన్నారు. విద్యార్థులకు పంపిణీ చేసిన దుప్పట్లు పలుచగా ఉన్నాయి. దీంతో కొంతమంది ఇళ్ల వద్ద నుంచి దుప్పట్లు తెచ్చుకుని కప్పుకుంటున్నారు. వసతిగృహంలో గది కీటికీలకు తలుపులు సక్రమంగా లేకపోవటంతో వాటిని బట్టలు ఆరవేసే దండాలుగా ఉపయోగిస్తున్నారు. కిటీకీల తలుపులు మూసే అవకాశం లేకపోవటంతో రాత్రివేళ చలి నుంచి రక్షణ లేకుండా పోయింది. బాత్‌రూమ్‌ల నిర్వహణ సక్రమంగా లేకపోవటంతో ఆరుబయట ట్యాంకు వద్దనే చలికి వణుకుతూ స్నానాలు చేస్తున్నారు.


