సంక్షేమ హాస్టళ్లలో చలికి గజగజ వణుకుతున్న విద్యార్థులు
సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులు చలికి గజగజ
వణికుతున్నారు. ఓ పక్క సరైన వసతులు
లేకపోవడం.. మరోవైపు హాస్టళ్లలో అందించిన దుప్పట్లు పల్చగా ఉండడంతో ఇంటి నుంచి దుప్పట్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. భవనాల్లో కిటికీలు సరిగా లేక చల్లటిగాలికి
నిద్రపట్టని రాత్రులు గడుపుతున్నారు. వణికించే చలిలో విద్యార్థులు చన్నీళ్లతో స్నానం
చేయడం కష్టంగా మారింది. ఇక, కొన్నిచోట్ల బెడ్లులేక బండలపైనే దుప్పట్లు పరుచుకుని
పడుకుంటున్నారు. ఆదివారం జిల్లాలోని కొన్ని హాస్టళ్లను ‘సాక్షి’ విజిట్ చేయగా అనేక
సమస్యలు వెలుగులోకి వచ్చాయి.
ఫ చలికాలం వచ్చినా రగ్గులు ఇవ్వని దుస్థితి
ఫ కిటికీలు ధ్వంసమై చలిగాలులతో ఇబ్బందులు
ఫ కొన్నిచోట్ల బండలపైనే నిద్రిస్తున్న విద్యార్థులు
‘సాక్షి’ విజిట్‌లో వెలుగుచూసిన వాస్తవాలు
నల్లగొండ: సంక్షేమ హాస్టళ్లు సంక్షోభ లోగిళ్లుగా మారాయి. జిల్లాలో చాలా హాస్టళ్లు అద్దె భవనాల్లో మగ్గుతున్నాయి. వాటికి ప్రభుత్వం నుంచి అద్దె విడుదల కాకపోవడంతో యజమానులు మరమ్మతులు చేయించడం లేదు. దీంతో అరకొర వసతుల నడుమ విద్యార్థులు గడుపుతున్నారు. జిల్లా కేంద్రంలోని దేవరకొండ రోడ్డులోని ఎస్సీ కళాశాల హాస్టల్‌లో ఒక్క మరుగుదొడ్డినే 80 మంది విద్యార్థులు వాడుతున్నారు. ఉదయం 5 గంటల నుంచి ఆ మరుగుదొడ్డి వద్ద లైన్ కడుతున్నారు. కిటికీలకు తలుపులు లేవు. కొన్ని రూమ్‌లలో ఫ్యాన్లు లేవు. కొన్ని రూమ్‌లలో లైట్లు లేవు. హాస్టల్‌లో ఏ మూలన చూసినా ఎర్రగా గుట్కాలు తిని ఊసినట్లుగా కనిపిస్తున్నాయి. రెండేళ్ల నుంచి చెబుతున్నా కనీసం సున్నం వేయించడం లేదని విద్యార్థులు చెబుతున్నారు. ఇక హాస్టల్‌లో విద్యార్థులకు చద్దర్లు లేక చలికి వణుకుతున్నారు. ఇక, పట్టణంలోని శాంతినగర్ బీసీ బాలుర హాస్టల్‌లోనూ అదే దుస్థితి. రేకులు దెబ్బతినడంతో వర్షం వచ్చినప్పుడు నీరు వస్తోంది. కిటికీలకు తలుపులు లేవు. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పానగల్ రోడ్డులోని ఎస్సీ సంక్షేమ బాలుర హాస్టల్‌లో 70 మంది విద్యార్థులు ఉన్నారు. భవనం మంచిగా ఉన్నప్పటికీ ఆవరణలో బండలు దెబ్బతిన్నాయి. బాత్‌రూమ్‌లు మరమ్మతుకు గురయ్యాయి. దీంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.
సంక్షేమ హాస్టళ్లలో చలికి గజగజ వణుకుతున్న విద్యార్థులు
సంక్షేమ హాస్టళ్లలో చలికి గజగజ వణుకుతున్న విద్యార్థులు


