నేలపైనే నిద్ర
మిర్యాలగూడ టౌన్ : మిర్యాలగూడ పట్టణంలోని హౌసింగ్‌బోర్డు కాలనీలో ఎస్టీ (ఏ) హాస్టల్‌లో కిటీకీలకు డోర్లు లేకపోవడంతో విద్యార్థులు చద్దర్లను కిటికీలకు అడ్డంగా కట్టుకున్నారు. చలి విపరీతంగా ఉన్నప్పటికీ చన్నీటి స్నానాలు చేస్తున్నారు. విద్యార్థులకు సరిపడా మరుగుదొడ్లు, స్నానపు గదులు లేకపోవడంతో బయట నల్లాల వద్దనే స్నానాలు చేస్తున్నారు. ఎస్టీ (సీ) హాస్టల్‌లోనూ అదే పరిస్థితి ఉంది. సుందర్‌నగర్‌లోని ఎస్టీ కళాశాల హాస్టల్‌లో విద్యార్థులు చలికి వణుకుతున్నారు. గదుల కిటికీలకు తలుపులు లేకపోవడంతో చలి గాలి వస్తోందని, ఉదయాన్నే చల్లటి నీటితో స్నానాలు చేసి కళాశాలకు వెళ్లాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు. అధికారులు హీటర్లను అందించాలని కోరుతున్నారు.


