మంత్రుల పర్యటనకు అంతా సిద్ధం
సమ్మె విరమించాలి : కలెక్టర్
మిర్యాలగూడ : మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసేందుకు రాష్ట్ర రోడ్లు, భవనాలు శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రానున్న నేపథ్యంలో ఏర్పాట్లను కలెక్టర్ ఇలా త్రిపాఠి, స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మిర్యాలగూడ పట్టణంలోని అద్దంకి–నార్కట్‌పల్లి బైపాస్‌లోని హెలిపాడ్ వద్దకు ఉదయం 9:30 గంటలకు మంత్రులు చేరుకుంటారని, రోడ్డు మార్గం ద్వారా కాల్వపల్లిలో శెట్టిపాలెం నుంచి అవంతీపురం వరకు నిర్మిస్తున్న ఔటర్ రింగ్ రోడ్డుకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు. అనంతరం కేఎన్‌ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాల, హౌసింగ్‌బోర్డులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నూతనంగా నిర్మించిన భవనాలను ప్రారంభిస్తారని పేర్కొన్నారు. సాగర్ రోడ్డులో గల ఫ్‌లైవర్ బిడ్జి వద్ద 75 కోట్ల 25 లక్షల రూపాయలతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు. అశోక్‌నగర్‌లో గల అయ్యప్ప దేవాలయంలో జరిగే మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటారని అన్నారు. 12.30గంటలకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతారని తెలిపారు. కార్యక్రమంలో పబ్లిక్ హెల్త్ ఎస్‌ఈ కందుకూరి వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ జి.శ్రీనివాస్, తహసీల్దార్లు సురేష్‌కుమార్, రాగ్యానాయక్ తదితరులు ఉన్నారు.
నల్లగొండ : పత్తి రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని జిన్నింగ్ మిల్లుల యజమానులు సమ్మె విరమించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. ఆదివారం రాత్రి తన క్యాంపు కార్యాలయంలో మార్కెటింగ్ శాఖ అధికారులు, జిల్లాలోని జిన్నింగ్ మిల్లుల యజమానులతో ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిన్నింగ్ మిల్లుల యజమానుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని తెలిపారు. వెంటనే రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ సెక్రటరీ సురేంద్రమోహన్‌తో కలెక్టర్ ఫోన్ ద్వారా మాట్లాడి జిన్నింగ్ మిల్లుల యజమానుల సమస్యలను వివరించారు. అయితే రాష్ట్ర అసోసియేషన్‌తో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని జిన్నింగ్ మిల్లుల యజమానులు కలెక్టర్‌కు తెలిపారు.
ఫ ఏర్పాట్లను పరిశీలించిన
కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎమ్మెల్యే


