కుటుంబ విలువలే సమాజాన్ని నడిపిస్తాయి
రామగిరి(నల్లగొండ): సమాజానికి మూలం కుటుంబమే అని, కుటుంబ విలువలే సమాజాన్ని నడిపిస్తాయని మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. సృజన సాహితీ అధ్యక్షుడు పెరుమాళ్ల ఆనంద్ వివాహ వేడుకపై రాసిన చేతిలో చెయ్యేసి కథల పుస్తకాన్ని ఆదివారం నల్లగొండలోని యూటీఎఫ్ భవన్‌లో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నర్సిరెడ్డి మాట్లాడుతూ పెరుమాళ్ల ఆనంద్ సామాజిక బాధ్యత ఉన్న సాహిత్యకారుడు కనుక కుటుంబ ఉత్సవాలను సైతం సాహిత్య ఉత్సవాలుగా మార్చుతున్నారని అన్నారు ప్రముఖ కథా రచయిత మేరెడ్డి యాదగిరి రెడ్డి మాట్లాడుతూ తెలుగు సాహిత్యంలో నల్లగొండ కథకు పుట్టినిల్లుగా నిలిచిందని, ఇప్పుడు నల్లగొండ నుంచి వినూత్నంగా పెళ్లి నేపథ్యంగా కథలు రావడం శుభ పరిణామన్నారు. ఈ సంకలనాన్ని సృజన సాహితీ కార్యదర్శి సాగర్ల సత్తయ్య దంపతులకు అంకితమిచ్చారు. డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మునాసు వెంకట్, కోమలి కళా సమితి అధ్యక్షుడు బక్క పిచ్చయ్య, యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ల వెంకటేశం, కవయిత్రి నాగిరెడ్డి అరుణజ్యోతి, పుస్తక సమీక్షకులు, ఎంజీయూ అధ్యాపకురాలు సి.అనితకుమారి, డాక్టర్ పొట్ట బత్తుల రామకృష్ణ, బండారు శంకర్, పుస్తక సంపాదకులు శీలం భద్రయ్య షీలా అవిలేను, డాక్టర్ పగడాల నాగేందర్, బైరెడ్డి కృష్ణారెడ్డి, పెందోట సోము, మాదగాని శంకరయ్య, పగిడిపాటి నరసింహ, ఎంజీయూ పీజీ విద్యార్థులు పాల్గొన్నారు.
ఫ మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి


