7న ఎంజీయూలో ప్లేస్‌మెంట్‌ డ్రైవ్‌ | - | Sakshi
Sakshi News home page

7న ఎంజీయూలో ప్లేస్‌మెంట్‌ డ్రైవ్‌

Apr 6 2025 1:45 AM | Updated on Apr 6 2025 1:45 AM

7న ఎం

7న ఎంజీయూలో ప్లేస్‌మెంట్‌ డ్రైవ్‌

నల్లగొండ టూటౌన్‌ : నల్లగొండ లోని మహత్మాగాంధీ యూనివర్సిటీలో ఈనెల 7వ తేదీన శ్రీ చైతన్య ఎడ్యుకేషనల్‌ ఇనిస్టిట్యూషన్స్‌ సహకారంతో ప్లేస్‌మెంట్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నట్లు ఎంజీయూ ప్లేస్‌మెంట్‌ సెల్‌ డైరెక్టర్‌ వై.ప్రశాంతి, ప్లేస్‌మెంట్‌ కోఆర్డినేటర్స్‌ వెంకట్‌, శేఖర్‌, సత్యనారాయణరెడ్డి, సమ్‌రీన్‌ బేగం శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా బోధన, బోధనేతర సిబ్బందిని నియమించడానికి ప్లేస్‌మెంట్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పీజీ బీఈడీ, యూజీ బీఈడీ పూర్తయిన వారు అర్హులని చెప్పారు. సర్టిఫికెట్లతో ఇంటర్వ్యూకు హాజరు కావాలని సూచించారు. ఇతర వివరాలకు 9010203857 ఫోన్‌ నంబర్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు.

‘ఏమి చేయాలి ఇండియాలో..’ పుస్తకావిష్కరణ

నల్లగొండ టౌన్‌ : బహుజన పొలిటికల్‌ సెంటర్‌ జాతీయ నాయకుడు సాధు మాల్యాద్రి రచించిన ‘ఏమి చేయాలి ఇండియాలో..’ అనే సిద్దాంత గ్రంథాన్ని శనివారం నల్లగొండలోని అంబేద్కర్‌ భవన్‌లో బహుజన కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.పర్వతాలు ఆవిష్కరించారు. కార్యక్రమంలో డేవిడ్‌కుమార్‌, దర్శనం నర్సింహ, అంబటి నాగయ్య, పాలడుగు నాగార్జున, జానకిరాంరెడ్డి, చింతమళ్ల గురవయ్య, గజ్జి రవి, పందుల సైదులు, సుధాకర్‌రెడ్డి, సాగర్‌, విజయ్‌కుమార్‌ పాల్గొన్నారు.

ధ్రువీకరణ పత్రాలు తెచ్చి వాహనాలు తీసుకెళ్లాలి

నల్లగొండ : కేసులు నమోదైన వాహనాలను సంబంధిత వాహనదారులు ఆరు నెలల్లోగా సరైన ద్రువీకరణ పత్రాలు చూపించి వారి వాహనాలు తీసుకెళ్లాలని సోమవారం ఒక ప్రకనటలో పేర్కొన్నారు. జిల్లాలోని వివిధ పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదైన 14 మోటారు సైకిళ్లను నల్లగొండ జిల్లా పోలీస్‌ కార్యాలయానికి తరలించారు. ఆరు నెలల్లోగా సరైన ధ్రువీకరణ పత్రాలు చూపించి వాహనాలు తీసుకెళ్లకపోతే ఆ వాహనాలను ప్రభుత్వ నిబంధనల ప్రకారం బహిరంగ వేలం వేస్తామని తెలిపారు. పూర్తి వివరాలకు 8712670170 ఫోన్‌ నంబర్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు.

ఉపాధ్యాయులు బాధ్యతలపై దృష్టిపెట్టాలి

నల్లగొండ : ఉపాధ్యాయులు హక్కుల కంటే తమ బాధ్యతలపై దృష్టి పెట్టాలని మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. నల్లగొండలోని టీఎస్‌యూటీఎఫ్‌ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయులు బాధ్యతలపై దృష్టి పెట్టకపోతే రాబోయే పదేళ్లలో ప్రభుత్వ విద్య కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. అనంతరం జగ్జీవన్‌రామ్‌ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు బక్క శ్రీనివాస్‌చారి, ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ల వెంకటేశం, శేఖర్‌రెడ్డి, ఎడ్ల సైదులు, రమాదేవి, అరుణ, రామలింగయ్య, గేర నరసింహ, ఎం.శ్రీనివాస్‌రెడ్డి, నలపరాజు వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

‘కాంగ్రెస్‌ కార్యకర్తల్లా

వ్యవహరిస్తున్న అధికారులు’

నల్లగొండ టూటౌన్‌ : రేషన్‌షాపుల వద్ద ప్రధాని మోదీ ఫొటో పెట్టకుండా.. కాంగ్రెస్‌ నాయకుల ఫొటోలు పెడుతూ అధికారులు కాంగ్రెస్‌ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ నాగం వర్షిత్‌రెడ్డి అన్నారు. శనివారం స్థానిక బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సన్నబియ్యానికి ఏడాదికి రూ.10 వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేస్తోందన్నారు. రేషన్‌షాపుల వద్ద సన్న బియ్యం పథకాన్ని కాంగ్రెస్‌ మాజీ ప్రతినిధులతో ప్రారంభించడం సిగ్గుచేటన్నారు. బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో పార్టీ నాయకులు గోలి మధుసూదన్‌రెడ్డి, వీరెళ్లి చంద్రశేఖర్‌, మిర్యాల వెంకటేశం, రమణ తదితరులు పాల్గొన్నారు.

7న ఎంజీయూలో ప్లేస్‌మెంట్‌ డ్రైవ్‌1
1/1

7న ఎంజీయూలో ప్లేస్‌మెంట్‌ డ్రైవ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement