బ్రాహ్మణవెల్లెంల ప్రాజెక్టు వివరాలు సమర్పించాలి
నార్కట్‌పల్లి: బ్రాహ్మణవెల్లెంల ప్రాజెక్టు కింద సేకరించిన భూమి, చెల్లింపు వివరాలన్నీ వెంటనే సమర్పించాలని కలెక్టర్ చంద్రశేఖర్ ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం నార్కట్‌పల్లి మండలంలోని బ్రాహ్మణవెల్లెంల రిజర్వాయర్, పంపు హౌ్‌స్‌ను పరిశీలించి ఇంజనీర్లతో మాట్లాడారు. బ్రాహ్మణవెల్లెంల రిజర్వాయర్ ద్వారా అందిస్తున్న సాగునీరు, ఇప్పటివరకు అయిన పనులు, పెండింగ్ భూ సేకరణ, భూసేకరణకు చేసిన చెల్లింపులు తదితర వివరాలను ప్రాజెక్టు పర్యవేక్షక ఇంజనీర్ బద్రును అడిగి తెలుసుకున్నారు. భూసేకరణ పనులు, వాటికి చేసిన చెల్లింపులు, నిధుల పెండింగ్ వివరాలు ఇవ్వాలని సంబంఽధిత అధికారులకు చెప్పారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్‌చార్జ్ అదనపు కలెక్టర్, ఆర్డీఓ అశోక్‌రెడ్డి, ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సతీష్ చంద్ర, డీఈలు పిచ్చయ్య, మారం శ్రీనివాస్ ఉన్నారు.


