మునగాల: మండలంలోని నారాయణగూడెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి గురువారం రాత్రి సూర్యాపేట–ఖమ్మం జాతీయ రహదారిపై కూసుమంచి శివారులోని ఫ్‌లైఓవర్ బ్రిడ్జిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన షేక్ జానీపాషా(30)గ్రామపంచాయతీలో సిబ్బందిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. గురువారం తన అత్తగారి ఊరైన ఖమ్మం జిల్లా కొణిజెర్ల మండలం లాలాపురం గ్రామానికి బైక్‌పై వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తున్నాడు. ఈక్రమంలో బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో జానీపాషా తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఖమ్మం జిల్లా నేలకొండపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఐదేళ్ల లోపు వయస్సు గల ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
తాటిచెట్టు పైనుంచి
పడి గీతకార్మికుడు మృతి
మునుగోడు: గీతకార్మి కుడు తాటిచెట్టు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు పడి మృతిచెందాడు. ఈ సంఘటన గురువారం రాత్రి మునుగోడు మండలంలోని గూడపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన దేశిడి అంజయ్య గౌడ్ (65) గీతకార్మికుడు. రోజుమాదిరిగా గురువారం సాయంత్రం గ్రామ శివారులోని తాటి చెట్టు ఎక్కుతుండగా కాలుజారి పడిపోయాడు. తీవ్రగాయాలు కావడంతో కుటుంబ సభ్యులు నల్లగొండలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ అదేరోజు రాత్రి మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారైలు, కుమారుడు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రవి తెలిపారు.
టిప్పర్ దగ్ధం
మోత్కూరు: మరమ్మతులకు తీసుకెళ్తున్న టిప్పర్ లారీ ఇంజన్‌లో ఆకస్మికంగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. ఈ సంఘటన మోత్కూరు మండలం పొడిచేడు గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. మోత్కూరు ఎస్సై నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ పట్టణం హనుమాన్‌నగర్‌లోని ఏమిరెడ్డి జలేందర్‌రెడ్డికి చెందిన టిప్పర్ లారీ మరమ్మతులకు గురికాగా డ్రైవర్ వేముల వెంకటేషం అమ్మనబోలు గ్రామం నుంచి మోత్కూరు మీదుగా ఉప్పల్‌కు తీసుకెళ్తున్నాడు. మోత్కూరు మండలంలోని పొడిచేడు, అనాజిపురం గ్రామాల మధ్య ఇంజన్‌లో ఒకేసారి మంటలు వ్యాపించాయి. వాహనం పక్కకు నిలుపుతుండగానే మంటలు చెలరేగి టిప్పర్ పూర్తిగా దగ్ధమైంది. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నాగరాజు తెలిపారు.
బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి


