ఆగి ఉన్న గూడ్స్ ఆటోను ఢీకొన్న లారీ
చౌటుప్పల్ రూరల్: టైర్ పంక్చర్ కావడంతో రోడ్డు పక్కన నిలిపి ఉంచిన గూడ్స్ ఆటోను లారీ ఢీకొట్టడంతో ఆటో బోల్తాపడింది. దీంతో డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన శుక్రవారం చౌటుప్పల్ మండలంలోని బొర్రోళ్లగూడెం గ్రామ స్టేజి సమీపంలో హైదరాబాద్– విజయవాడ జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గూడ్స్ ఆటో కొబ్బరిబొండాల లోడ్‌తో అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నుంచి ఘట్‌కేసర్‌కు వెళ్తోంది. చౌటుప్పల్ మండలంలోని బొరోళ్లగూడెం గ్రామ సమీపంలో ఆటో టైర్ పంక్చర్ కావడంతో డ్రైవర్ వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపి టైరు తీస్తున్నాడు. ఈక్రమంలో కలకత్తా నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న లారీ వెనుక నుంచి వచ్చి ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటో రోడ్డు పక్కకు పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో కోనసీమ జిల్లా రాజోలు మండలం గూడపల్లికి చెందిన ఆటో డ్రైవర్ మామిడిశెట్టి విజయనర్సింహకు తీవ్రగాయాలయ్యాయి. లారీ డ్రైవర్ మహేష్‌కు చేతి వేళ్లు తెగి గాయాలయ్యాయి. పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. గాయపడిన ఆటో డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి, లారీ డ్రైవర్‌ను చౌటుప్పల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గూడ్స్ ఆటో యజమాని జోగి పల్లంశెట్టి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై చల్లా యాదవరెడ్డి తెలిపారు.
ఫ ఆటో డ్రైవర్‌కు తీవ్రగాయాలు


