నల్లగొండ: కృత్రిమ మేధ సాయంతో నాణ్యమైన విద్యను అందుతుందని డీఈఓ భిక్షపతి అన్నారు. మంగళవారం నల్లగొండ మండలంలోని చందనపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో కృత్రిమ మేధ ల్యాబ్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రతి విద్యార్థి సామర్థ్యం మదింపు చేసి వారి స్థాయికి తగిన విధంగా తెలుగు, ఆంగ్ల పదాలు, వాక్యాలు, గణిత సమస్యలను సాధించడంలో ఏఐ సహకరిస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి ఆర్.రామచంద్రయ్య, హెచ్‌ఎం ఎం.రాజశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.
బోధనా సిబ్బందికి
ఇంటర్వ్యూలు
నల్లగొండ టౌన్ : నల్లగొండ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో కాంట్రాక్టు పద్ధతిన బోధనా సిబ్బంది నియామకానికి మంగళవారం కలెక్టరేట్‌లో సర్టిఫికెట్ పరిశీలన, ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇంటర్వ్యూలకు 15 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఫలితాలను మెడికల్ కళాశాల వెబ్‌సైట్‌లో ఉంచుతామని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీవాణి తెలిపారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రామచంద్ర, డాక్టర్ వినీలారాణి, డాక్టర్ మాతృ పాల్గొన్నారు.
ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలి
నల్లగొండ టూటౌన్ : విద్యార్థులు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఎంఎస్‌ఎంఈ సంస్థ ప్రతినిధి జె.కోటేశ్వర్‌రావు సూచించారు. మంగళవారం ఎంజీయూలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆత్మ నిర్భర్ భారత్, వికసిత్ భారత్ లాంటి కార్యక్రమాలు విద్యార్థులకు ఉపయోగపడతాయని తెలిపారు. ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ మద్దిలేటి మాట్లాడుతూ విద్యార్థులు నలుగురికి ఉద్యోగావకాశాలు కల్పించే స్థాయిలో ఉండేలా ఆలోచన చేయాలన్నారు. కార్యక్రమంలో ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ అరుణప్రియ, సైన్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రేమ్‌సాగర్, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఆనంద్ పాల్గొన్నారు.
చెర్వుగట్టు హుండీ ఆదాయం రూ.32,28,760
నార్కట్‌పల్లి : మండలంలోని చెర్వుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి కానుకల హుండీలను మంగళవారం లెక్కించారు. 41 రోజుల్లో రూ.32,28,760 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారి నవీన్‌కుమార్ తెలిపారు. కార్యక్రమానికి సూపరింటెండెంట్ తిరుపతిరెడ్డి, ప్రధాన అర్చకుడు రామలింగేశ్వరశర్మ, సీనియర్ అసిస్టెంట్ ఇంద్రసేనారెడ్డి, సిబ్బంది శ్రీనివాస్‌రెడ్డి, నర్సిరెడ్డి, రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
సాఫ్ట్‌బాల్ జట్టు ఎంపిక
నల్లగొండ టూటౌన్ : నెల్లూరు జిల్లా సింహపురి విశ్వవిద్యాలయంలో ఏప్రిల్ 30న నిర్వహించనున్న జాతీయ సాఫ్ట్‌బాల్ పోటీల్లో పాల్గొనే మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం మహిళా జట్టును మంగళవారం ఎంపిక చేశారు. ఎంజీయూ పరిధిలోని వివిధ డిగ్రీ కళాశాలలకు చెందిన అక్షయ, రవళి, రేష్మా, శ్రావణి ఎంపికయ్యారు. కార్యక్రమంలో ఎంజీయూ స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ హరీష్‌కుమార్, ప్రొఫెసర్ సోమలింగం, మురళి, శ్రీనివాస్‌రెడ్డి, శ్యాంసుందర్, నాగిరెడ్డి, పృథ్వీరాజ్, అజయ్ పాల్గొన్నారు.