హాలియా : పదో తరగతి పరీక్షలు సజావుగా జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. శనివారం హాలియా పట్టణంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన పదో తరగతి పరీక్ష కేంద్రాన్ని ఆమె ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌తో కలిసి తనిఖీ చేశారు. పరీక్షకు హాజరైన విద్యార్థుల వివరాలతో పాటు కేంద్రంలో సౌకర్యాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పరీక్ష కేంద్రాల వద్ద భద్రతను పకడ్బందీగా నిర్వహించాలని, ఎట్టి పరిస్థితిలోనూ ఇతరులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించవద్దని పేర్కొన్నారు. వారి వెంట మిర్యాలగూడ సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ్, డీఎస్పీ రాజశేఖరరాజు, సీఐ జనార్దన్‌గౌడ్, ఎంఈఓ కృష్ణమూర్తి, ఎస్‌ఐ సతీష్‌రెడ్డి ఉన్నారు.
39 మంది గైర్హాజరు
నల్లగొండ : పదో తరగతి పరీక్షల రెండోరోజు శనివారం జిల్లా వ్యాప్తంగా 39 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా 105 పరీక్ష కేంద్రాల్లో శనివారం జరిగిన పరీక్షకు మొత్తం 18,553 మంది విద్యార్థులకుగాను, 18,514 మంది హాజరయ్యారు. 39 మంది గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు.
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి