నల్లగొండ టౌన్ : ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రూ.20 వేల వేతనం అమలు చేయాలని వీఓఏల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. వివిధ కారణాలతో తొలగించిన వీఓఏలను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ జె.శ్రీనివాస్, డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డికి వినతిపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో చిలుముల దుర్గయ్య, సులోచన, పోలె సత్యనారాయణ, కె.చంద్రకళ, మంగమ్మ, సువర్ణ, నగేష్, సురేష్, సైదమ్మ, పుష్పలత, పాపయ్య, లక్ష్మి, నాగమణి పాల్గొన్నారు.