నాగార్జునసాగర్ : ఎస్సీ, ఎస్టీలను బలోపేతం చేసేందుకు మెరుగైన అవకాశాలు కల్పించడంతో పాటు వారికి ప్రభుత్వ పథకాల్లో లబ్ధి చేకూర్చేందుకు రూల్‌ఆఫ్ రిజర్వేషన్ పాటించాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ రాష్ట్ర చైర్మన్ బిక్కి వెంకటయ్య పేర్కొన్నారు. బుధవారం నాగార్జునసాగర్ సందర్శనకు వచ్చిన ఆయన ప్రధాన విద్యుదుత్పాదన కేంద్రంలో సాగునీటిశాఖ అధికారులతో పాటు తెలంగాణ జెన్‌కో, ట్రాన్స్‌కో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వారు ఫవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పలు విషయాలను ఆయనకు వివరించారు. ఈ సమావేశంలో ఇంజనీర్లు, షెడ్యూల్డ్ కులాల జిల్లా ఉప సంచాలకుడు వి.కోటేశ్వర్‌రావు, సహాయ సాంఘిక సంక్షేమశాఖ అధికారి వి.వెంకటకృష్ణ, జయపాల్ తదితరులు పాల్గొన్నారు.
సబ్‌జైల్‌ను సందర్శించిన జైళ్ల శాఖ డీఐజీ
దేవరకొండ : దేవరకొండ సబ్‌జైల్‌ను బుధవారం హైదరాబాద్ రేంజ్ జైళ్ల శాఖ డీఐజీ డాక్టర్ డి.శ్రీనివాస్ సందర్శించారు. ఈ సందర్భంగా సబ్‌జైల్‌లో పరిసరాలను ఆయన పరిశీలించి జైలు అధికారులకు పలు సూచనలిచ్చారు. అనంతరం విచారణ ఖైదీలతో ఆయన మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సబ్‌జైల్ సందర్శనకు వచ్చిన డీఐజీకి జిల్లా సబ్‌జైల్స్ అధికారి, జిల్లా జైలు సూపరింటెండెంట్ ప్రమోద్, దేవరకొండ సబ్‌జైల్ సూపరింటెండెంట్ హర్షవర్ధన్ స్వాగతం పలికారు. వారి వెంట పలువురు సిబ్బంది ఉన్నారు.
చండూరు మార్కెట్ కమిటీ నియామకం
చండూరు : చండూరు వ్యవసాయ మార్కెట్‌కు నూతన కమిటీని నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు విడుదల చేసింది. నూతన చైర్మన్‌గా దోటి నారాయణ (మునుగోడు), వైస్ చైర్మన్‌గా పోలు వెంకట్‌రెడ్డి (చండూరు) నియమితులయ్యారు. సభ్యులుగా భూతరాజు ఆంజనేయులు, తలారి నర్సింహ, మోదుగు బాల్‌రెడ్డి, లోడే రవి, మెగావత్ బిచ్యానాయక్, ఉప్పరబోయిన నర్సింహ, కుంభం చెన్నారెడ్డి, నలపరాజు రామలింగయ్య, బొమ్మరగోని మంగమ్మ, షేక్‌ఆహ్మద్, కర్నాటి నారాయణ, ఇడికూడ దామోదర్‌ను నియమించారు. నూతన కమిటీ త్వరలో ప్రమాణ స్వీకారం చేయనుంది.
ఇంటర్ పరీక్షకు 368 మంది గైర్హాజరు
నల్లగొండ : ఇంటర్మీడియట్ సెకండియర్ పరీక్షకు బుధవారం 368 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు జరిగిన సెకండియర్ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 13,511 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 13,143 మంది హాజరయ్యారు. 368 మంది గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు.
రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాలి
రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాలి
రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాలి