
జిల్లాస్థాయి యోగాసన పోటీలు
రామగిరి(నల్లగొండ) : జిల్లాస్థాయి యోగాసన పోటీలు నల్లగొండ పట్టణంలోని బోధి యోగా ఫిట్నెస్ సెంటర్‌లో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా నల్లగొండ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, జనరల్ సెక్రటరీ కోట సింహాద్రి, రాయనబోయిన శ్రీను మాట్లాడుతూ 125 మంది ఈ యోగాసన పోటీల్లో పాల్గొన్నట్లు తెలిపారు. ఇక్కడ గెలుపొందిన వారు ఈ నెల 28, 29 తేదీల్లో నిజామాబాద్‌లో జరిగే రాష్ట్ర స్థాయి యోగాసన పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. విజేతలకు నల్లగొండ మున్సిపల్ మాజీ చైర్మన్ బోయపల్లి కృష్ణారెడ్డి సర్టిఫికెట్లు, బహుమతులు అందజేశారు.