● రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
పెద్దకొత్తపల్లి: అర్హులైన ప్రతి పేద కుటుంబానికి రాజకీయాలకు అతీతంగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బుధవారం మండలంలోని గంట్రావుపల్లి, చెన్నపురావుపల్లి గ్రామాల్లో నిర్వహించిన ఇందిరమ్మ గృహా ప్రవేశ కార్యక్రమాల్లో మంత్రి పాల్గొని లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నూతన ఇంటిలో కుటుంబ సభ్యులు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని అకాంక్షించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ తొలి విడతలో రూ.22,500 కోట్ల వ్యయంతో ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసిందన్నారు. రెండో విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 2.50 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని, నియోజవర్గానికి 2 వేల చొప్పున మంజూరు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఇళ్ల నిర్మాణం చేపడుతున్న లబ్ధిదారులకు విడతల వారీగా రూ.5 లక్షలు ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు లక్ష్మణ్‌రావు, వెంకటమ్మ చిన్నయ్య, వెంకటస్వామి పాల్గొన్నారు.


