నాగర్‌కర్నూల్ రూరల్: నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేసే దిశగా ముందుకెళ్తున్నామ ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని తూడుకుర్తిలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ గృహ ప్రవేశాలల్లో ఎమ్యేల్యే రాజేశ్‌రెడ్డి పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరికీ సొంతింటి కల నేరవేర్చడమే కాంగ్రెస్ లక్ష్యమన్నారు. అనంతరం గ్రామంలో నూతనంగా నిర్మించిన ఎంపీపీఎస్ పాఠశాల భవనాన్ని సందర్శించి, విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మి కర్ణాకర్, ఉప సర్పంచ్ వెంకటయ్య మాజీ ఎంపీపీ కోటయ్య, ఇంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


