జాతీయ స్థాయి పోటీలకు ఆటోమేటెడ్ ఫర్టిలైజర్ పరికరం
తెలకపల్లి: జిల్లా, రాష్ట్రస్థాయిలో ప్రతిభచాటిన పెద్దపల్లి విద్యార్థిని రూపొందించిన ఆటోమేటెడ్ ఫర్టిలైజర్ పరికరం జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై ంది. ఈ నెల 7 నుంచి 9 వరకు కామారెడ్డి జిల్లాలో మూడు రోజులపాటు నిర్వహించిన రాష్ట్రస్థాయి ఇన్‌స్పైర్ వైజ్ఞానిక ప్రదర్శనలో మండలంలోని పెద్దపల్లి ఉన్నత పాఠశాల విద్యార్థిని గీతామాధురి ప్రదర్శించిన ఆటోమేటెడ్ ఫర్టిలైజర్ పరికరం జాతీయ స్థాయికి ఎంపికై ందని గైడ్ టీచర్ చందుపాషా తెలిపారు. గీతామాధురి ఎలాంటి శ్రమ లేకుండా యూరియా, డీఏపీ, పొటాష్ వంటి ఎరువులను మొక్కజొన్న, మిరప పంటలకు వెదజల్లేలా ఆటోమేటెడ్ ఫర్టిలైజర్ పరికరం రూపొందించారు. ఈ మేరకు జాతీయ స్థాయికి ఎంపికవడంతో ఎమ్మెల్సీ అంజిరెడ్డి బంగారు పతకం, ప్రశంసా పత్రం, జ్ఞాపిక అందుకున్నారు. ఫిబ్రవరిలో ఢిల్లీలో జరిగే జాతీయ స్థాయి ప్రదర్శనలోనూ ప్రతిభచాటాలని ఆకాంక్షించారు. అలాగే డీఈఓ రమేష్‌కుమార్, జిల్లా సైన్సు అధికారి రాజశేఖర్, గైడు టీచర్, ఉపాధ్యా యులు విద్యార్థిని గీతామాధురిని అభినందించారు.


