
అమరవీరులకు ఘన నివాళి
తిమ్మాజిపేట: మండలంలోని గొరిటలో ఆదివారం రాత్రి భారత్–పాకిస్తాన్ యుద్ధంలో అమరులైన భారత జవాన్లకు ఘన నివాళి అర్పించారు. గ్రామ వీధుల్లో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి చివరగా దేవాలయం సమీపంలో అమరవీరుల చిత్రపటాలు ఏర్పాటుచేసి రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఆర్మీ అసోసియేషన్ అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు చెన్నయ్య, కోశాధికారి నోబుల్‌రెడ్డి, సలహాదారులు రాంగోపాల్, శాంతయ్య, లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.
పాలిసెట్‌కు ఏర్పాట్లు పూర్తి
కందనూలు: జిల్లాలో ఈ నెల 13న జరగనున్న పాలిసెట్‌కు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పాలిసెట్ జిల్లా క న్వీనర్ మదన్‌మోహన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 9 కేంద్రాలు ఏర్పాటు చేశామని.. జిల్లాకేంద్రంలో 8, పాలెంలో ఒక కేంద్రం ఉన్నట్లు చెప్పారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు పరీక్ష కొనసాగనుండగా.. 2,805 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నట్లు తెలిపారు. ఇందులో 1,354 మంది బాలురు, 1,451 మంది బాలికలు ఉన్నారని.. ప్రతి కేంద్రా న్ని జీపీఎస్‌తో అనుంధానించిన ట్లు వివరించారు. పరీక్షకు హాజ రయ్యే విద్యార్థులు హాల్‌టికెట్, హెచ్‌బీ పెన్సిల్, బ్లూ, బ్లాక్‌పెన్ తీసుకొని గంట ముందు కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు అసిస్టెంట్ కో–ఆర్డినేటర్ ఎం.అంజయ్య సెల్‌నంబర్ 94918 77502 సంప్రదించాలన్నారు.
అడుగంటుతున్న
కోయిల్‌సాగర్
దేవరకద్ర: కోయిల్‌సాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం రోజురోజుకూ తగ్గుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 32.6 అడుగులు కాగా.. ఆదివారం 11.6 అడుగులకు చేరింది. యాసంగి సాగుకు ముందు ప్రాజెక్టులో 31.6 అడుగుల నీటిమట్టం ఉండగా పంటలు పూర్తయ్యే నాటికి 13.3 అడుగులకు చేరింది. యాసంగి సాగు పూర్తయిన తర్వాత ప్రాజెక్టు మూడు పంప్‌హౌస్‌ల నుంచి తాగునీటిని సరఫరా చేస్తున్నారు. దీంతో మూడు వారాల్లో 1.9 అడుగులుతగ్గింది. ప్రాజెక్టులో ప్రస్తుతం 11.6 అడుగుల నీరు ఉంది.