
ఉత్సాహంగా తిరంగా ర్యాలీ
కందనూలు: పెహల్గాంలో ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌కు మద్దతుగా జిల్లాకేంద్రంలో మంగళవారం సాయంత్రం తిరంగా ర్యాలీ నిర్వహించారు. భారత సాయుధ దళాలకు గౌరవ సూచికంగా, ఆపరేషన్ సిందూర్‌కు మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో భారీ సంఖ్యలో యువత తరలివచ్చారు. జిల్లాకేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో బాలుర ఉన్నత పాఠశాల నుంచి ప్రధాన రహదారి మీదుగా అంబేడ్కర్ కూడలి నుంచి పాత బస్టాండ్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ కొనసాగింది. ఈ ర్యాలీలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మాజీ సైనికులు, విద్యార్థులు, వ్యాపార సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు భారత జాతీయ పతాకాన్ని చేపట్టి భారత్ మాతాకీ జై, వందేమాతరం, జై జవాన్, అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో బీజేజీ రాష్ట్ర అధికార ప్రతినిధి దిలీపాచారి, జిల్లా అధ్యక్షుడు నరేందర్‌రావు, యువమోర్చ జిల్లా కార్యదర్శి నరేష్‌చారి, నాయకులు సుధాకర్, భరత్‌ప్రసాద్, సుబ్బారెడ్డి, సుధాకర్‌రెడ్డి, బాబుసాగర్ తదితరులు పాల్గొన్నారు.