
అభ్యసన సామర్థ్యాలు మెరుగు..
విద్యార్థుల మానసిక వ్యక్తిత్వం ఆధారంగా బోధిస్తున్నాం. అర్థమయ్యే రీతిలో బోధించి వారిని ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాం. అయినప్పటికీ పిల్లలు సామర్థ్యాన్ని అందుకోవడం లేదు. ఈ నేపథ్యంలో ఐదు రోజులపాటు ఇచ్చిన శిక్షణ విద్యార్థుల్లో కనీస విద్యా సామర్థ్యాల పెంపునకు దోహదపడుతుంది.
– చీర్ల కృష్ణయ్య, ఎస్‌ఏ ఆంగ్లం, కోడేరు
ఎంతో ప్రయోజనం..
ఉపాధ్యాయులు నిత్య విద్యార్థులు. బోధనా వికాసం, సాంకేతిక పాఠాలు, ఏఐ బోధన మెరుగుపరిచే విధంగా ఇస్తున్న శిక్షణ ఎంతో ప్రయోజనకరం. తరగతి గదిలో అర్థం చేసుకునే వాతావరణం కల్పిస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఇలాంటి అంశాలపై సృజనాత్మకత పెంచుతాం.
– పూజారి సురేందర్, డీఆర్పీ
శిక్షణకు పకడ్బందీ ఏర్పాట్లు..
జిల్లాలోఉపాధ్యాయ శిక్షణకు పకడ్బందీ ఏర్పాట్లు చేశాం. మూడు విడతల్లో శిక్షణ ఇచ్చేలా ప్రణాళిక రూపొందించాం. ఎస్జీటీలకు మండల స్థాయిలో, స్కూల్ అసిస్టెంట్లు, హెచ్‌ఎంలకు జిల్లాస్థాయిలో శిక్షణ ఉంటుంది. అంశాల వారీగా శిక్షణ కొనసాగుతుంది. ఉపాధ్యాయులు విధిగా శిక్షణకు హాజరు కావాలి.
– రమేశ్ కుమార్, జిల్లా విద్యాశాఖ అధికారి
●

అభ్యసన సామర్థ్యాలు మెరుగు..

అభ్యసన సామర్థ్యాలు మెరుగు..