
స్పందన అంతంతే..
ఈ నెల 3తో ముగిసిన ఎల్‌ఆర్‌ఎస్ రాయితీ గడువు
● మూడుసార్లు గడువు పెంచినా
నెరవేరని ప్రభుత్వ లక్ష్యం
● ఉమ్మడి జిల్లాలో
రూ.67.33 కోట్ల ఆదాయం
● అత్యధికంగా మహబూబ్‌నగర్ కార్పొరేషన్‌కు రూ.18.08 కోట్లు..
● అలంపూర్ మున్సిపాలిటీకి
రూ.16 లక్షలు మాత్రమే..
● నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలో 16,266 దరఖాస్తులు రాగా 10,782 కి ఫీజు చెల్లించాల్సి ఉంది. 2,895 మంది రూ.4.78 కోట్లు చెల్లించగా..1,728 మందికే ప్రొసీడింగ్స్ అందాయి. కల్వకుర్తిలో 11,643 దరఖాస్తులు రాగా 9,491 కి ఫీజు చెల్లించాల్సి ఉంది. ఇందులో 2,160 మంది రూ.4.85 కోట్లు చెల్లించారు. 1,088 మందికి ప్రొసీడింగ్స్ అందాయి. కొల్లాపూర్‌లో 4,654 దరఖాస్తులకు 3,718కి ఫీజు చెల్లించాల్సి ఉండగా 713 మంది రూ.1.23 కోట్లు చెల్లించారు. 264 మందికే ప్రొసీడింగ్స్ అందాయి. అచ్చంపేటలో 12,291 దరఖాస్తులకు 10,765కి ఫీజు చెల్లించాల్సి ఉండగా 1,871 మంది రూ.2.72 కోట్లు చెల్లించారు. 106 మందికే ప్రొసీడింగ్స్ అందాయి.
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్‌ఆర్‌ఎస్)కు పెద్దగా స్పందన రాలేదు. అనధికార లేఔట్లలోని స్థలాను క్రమబద్ధీకరణకు ప్రభుత్వం ఇచ్చిన 25 శాతం రాయితీ గడువు ముగిసినా.. అనుకున్న లక్ష్యం నెరవేరలేదు. మూడుసార్లు గడువు పెంచినా ప్లాట్లను క్రమబద్ధీకరించుకునేందుకు యజమానులు పెద్దగా ముందుకు రాలేదు. దీంతో ఉమ్మడి జిల్లాలోని మొత్తం 21 పురపాలికల్లో కలిపి కేవలం రూ.67.33కోట్ల ఆదాయం సమకూరింది. రాష్ట్ర ప్రభుత్వం మొదట ఈ ఏడాది మార్చి 31లోగా చెల్లించే వారికి మొత్తం ఫీజులో 25 శాతం రాయితీ ప్రకటించింది. అయితే ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడంతో ఈ గడువును ఏప్రిల్ 30 వరకు, మళ్లీ ఈనెల 3వ తేదీ వరకు ఇలా మూడుసార్లు పెంచింది.
పురపాలికల వారీగా ఆదాయం ఇలా..
● మహబూబ్‌నగర్ కార్పొరేషన్ పరిధిలో 32,005 దరఖాస్తులు రాగా.. వీటిలో ఎల్‌ఆర్‌ఎస్‌కు అర్హత కలిగిన 22,183కి ఫీజు చెల్లించాలని మున్సిపల్ అధికారులు నోటీసులిచ్చారు. ఇందులో 7,424 మంది దరఖాస్తుదారులు రూ.18.08 కోట్లు చెల్లించగా..ఇప్పటివరకు 2,910 మందికి ప్రొసీడింగ్స్ అందాయి. జడ్చర్ల పరిధిలో 17,935 దరఖాస్తులు రాగా.. అర్హత కలిగిన 11,071కి ఫీజు చెల్లించాల్సి ఉంది. ఇందులో 2,933 మంది దరఖాస్తుదారులు రూ.6.40 కోట్లు చెల్లించారు. ఇప్పటివరకు 847కి మాత్రమే ప్రొసీడింగ్స్ అందాయి. భూత్పూర్‌లో 6,341 దరఖాస్తుల్లో 4,703కి ఫీజు చెల్లించాల్సి ఉంంది. 1,375 మంది దరఖాస్తుదారులు రూ.2.67 కోట్లు చెల్లించగా.. 651కి ప్రొసీడింగ్స్ అందాయి. దేవరకద్ర పరిధిలో 6,765 దరఖాస్తులకు 6,699కి ఫీజు చెల్లించాల్సి ఉంది. 1,036 మంది రూ.1.69 కోట్లు చెల్లించారు. ఇప్పటివరకు 63 మందికే ప్రొసీడింగ్స్ అందాయి.
● వనపర్తి మున్సిపాలిటీ పరిధిలో 29,450 దరఖాస్తులు రాగా.. 25,827కి ఫీజు చెల్లించాల్సి ఉంది. 5,214 మంది దరఖాస్తుదారులు రూ.6.40 కోట్లు చెల్లించారు. 2,766 మందికే ప్రొసీడింగ్స్ అందాయి. పెబ్బేరులో 7,432 దరఖాస్తులు రాగా అర్హత కలిగిన 6,484 కి ఫీజు చెల్లించాల్సి ఉండగా 1,561 మంది రూ.1.88 కోట్లు చెల్లించారు. ఇప్పటివరకు 417 మందికే ప్రొసీడింగ్స్ అందాయి. కొత్తకోటలో 7,740 దరఖాస్తులు రాగా 7,318కి ఫీజు చెల్లించాల్సి ఉండగా 1,355 మంది రూ.1.60 కోట్లు చెల్లించారు. ఇప్పటివరకు 63 మందికే ప్రొసీడింగ్స్ అందాయి. ఆత్మకూరులో 3,827 దరఖాస్తులకు 3,150కి ఫీజు చెల్లించాల్సి ఉంది. 822 మంది రూ.98 లక్షలు చెల్లించగా..623 మందికే ప్రొసీడింగ్స్ అందాయి. అమరచింతలో 619 దరఖాస్తుల్లో 333కి ఫీజు చెల్లించాల్సి ఉండగా 164 మంది రూ.56 లక్షలు చెల్లించారు. ఇప్పటివరకు 121 మందికే ప్రొసీడింగ్స్ అందాయి.
● నారాయణపేట మున్సిపాలిటీలో 7,154 దరఖాస్తులలో 2,036కి ఫీజు చెల్లించాల్సి ఉండగా 1,639 మంది రూ.4.19 కోట్లు చెల్లించారు. 772 మందికే ప్రొసీడింగ్స్ అందాయి. మక్తల్‌లో 10,616 దరఖాస్తులకు 9,063కి ఫీజు చెల్లించాల్సి ఉండగా 1,288 మంది రూ.2.44 కోట్లు చెల్లించారు.599 మందికే ప్రొసీడింగ్స్ అందాయి. కోస్గి పరిధిలో 4,168 దరఖాస్తులు రాగా 1,987కి ఫీజు చెల్లించాల్సి ఉండగా 965 మంది రూ.1.94 కోట్లు చెల్లించారు. 135 మందికే ప్రొసీడింగ్స్ అందాయి. మద్దూరులో 1,493 దరఖాస్తులు రాగా 1,232 కి ఫీజు చెల్లించాల్సి ఉండగా 322 మంది రూ.34 లక్షలు చెల్లించారు. 234 మందికి ప్రొసీడింగ్స్ అందాయి.
● గద్వాల పట్టణ పరిధిలో 14,607 దరఖాస్తులు రాగా 4,000కి ఫీజు చెల్లించాల్సి ఉండగా 1,844 మంది రూ.2.96 కోట్లు చెల్లించారు. 927 మందికే ప్రొసీడింగ్స్ అందాయి. అయిజలో 10,166 దరఖాస్తులు రాగా అర్హత కలిగిన 5,244కి ఫీజు చెల్లించాల్సి ఉండగా 1,155 మంది రూ.1.47 కోట్లు చెల్లించారు. 689 మందికే ప్రొసీడింగ్స్ అందాయి. అలంపూర్‌లో 431 దరఖాస్తులే రాగా 366కి ఫీజు చెల్లించాల్సి ఉండగా 122 మంది కేవలం రూ.16 లక్షలే చెల్లించారు. 64 మందికి ప్రొసీడింగ్స్ అందాయి. వడ్డేపల్లిలో 1,967 దరఖాస్తులు రాగా 1,787కి ఫీజు చెల్లించాల్సి ఉండగా 378 మంది రూ.73 లక్షలు చెల్లించారు.304 మందికి ప్రొసీడింగ్స్ అందాయి.

స్పందన అంతంతే..