ప్రణాళిక సిద్ధం | - | Sakshi
Sakshi News home page

ప్రణాళిక సిద్ధం

Published Tue, May 6 2025 12:24 AM | Last Updated on Tue, May 6 2025 12:24 AM

ప్రణా

ప్రణాళిక సిద్ధం

నాగర్‌కర్నూల్‌
వానాకాలం..
జిల్లాలో 5.38 లక్షల ఎకరాల్లో పంటల సాగుకు అంచనా

మంగళవారం శ్రీ 6 శ్రీ మే శ్రీ 2025

వివరాలు 8లో u

అందుబాటులో ఉంచుతాం..

వానాకాలం సాగుకు సంబంధించి ఇప్పటికే ప్రణాళిక రూపొందించాం. రైతులకు కావాల్సిన విత్తనాలు, ఎరువుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం. ఎరువులకు సంబంధించి ప్రస్తుతం అందుబాటులో ఉన్నవే కాకుండా సీజన్‌ ప్రారంభం వరకు నెలవారి కోటా తెప్పించి అందుబాటులో ఉంచుతాం. జిల్లాలో ఈసారి 5,38,462 ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని అంచనా వేశాం.

– చంద్రశేఖర్‌, జిల్లా వ్యవసాయాధికారి

పెండింగ్‌ ఫిర్యాదులు

పరిష్కరించాలి

నాగర్‌కర్నూల్‌: వివిధ సమస్యలపై ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్లు, అమరేందర్‌, దేవసహాయంతో కలిసి కలెక్టర్‌ 50 ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న వారి సమస్యల పరిష్కారం కోసం అధికారులు వెంటనే పరిష్కార మార్గాలు చూపాలన్నారు. వివిధ శాఖలకు చెందిన సమస్యలపై వచ్చిన ఫిర్యాదులు వారికి పంపించి పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో కలెక్టరేట్‌ ఏవో చంద్రశేఖర్‌, కలెక్టరేట్‌ విభాగాల సూపరింటెండెంట్లు తదితరులు పాల్గొన్నారు.

ఫోర్జరీ సంతకాలతో ఆస్తి కాజేశారు

ఫోర్జరీ సంతకాలు చేసి నకిలీ వీలునామా పత్రాలు సృష్టించి తనకు రావాల్సిన ఆస్తిని అక్రమంగా స్వాధీనం చేసుకున్నాడంటూ హైదరాబాద్‌కు చెందిన అంకాల అనితరాణి ప్రజావాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. తిమ్మాజిపేట మండలం మారేపల్లికి చెందిన తన సొంత అన్న సుధీర్‌రెడ్డి ఫోర్జరీ సంతకాలతో దొంగ వీలునామా పత్రాలు సృష్టించి తనకు రావాల్సిన ఆస్తిని రాకుండా చేశారని, దీనిపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదే విషయమై నాగర్‌కర్నూల్‌ ఆర్డీఓకు సైతం ఫిర్యాదు చేశానని ఆమె వివరించారు.

పోలీస్‌ గ్రీవెన్స్‌కు 14 అర్జీలు

నాగర్‌కర్నూల్‌ క్రైం: పోలీస్‌ ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులు త్వరగా పరిష్కరించేందుకు సిబ్బంది కృషిచేయాలని ఎస్పీ గైక్వాడ్‌ వైభవ్‌ రఘునాథ్‌ అన్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన పోలీస్‌ ప్రజావాణికి 14 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. ఇందులో తగు న్యాయం కోసం 8, భూమి పంచాయతీలు 4, భార్యాభర్తల గొడవలకు సంబంధించి 2 ఫిర్యాదులు వచ్చాయన్నారు.

దరఖాస్తుల ఆహ్వానం

కోడేరు: మోడల్‌ కళాశాలలో ప్రవేశాల కోసం మండలంలో పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఈ నెల 20 వరకు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్‌ రాఘవేంద్ర సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ గ్రూపుల్లో 40 చొప్పున సీట్లు ఉన్నాయన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

ఈ ఏడాది వానాకాలంలో

అత్యధికంగా వరి, పత్తి సాగు

అందుబాటులో 25 శాతం విత్తనాలు, ఎరువులు

మిగతావి సీజన్‌ నాటికి

తెప్పించేలా కసరత్తు

దుక్కులు దున్నడంలో

నిమగ్నమైన అన్నదాతలు

విత్తనాల సైతం..

ఇక విత్తనాలు సైతం రైతులకు ఎంత అవసరమనే విషయంలో ముందుగానే అధికారులు అంచనాలు సిద్ధం చేశారు. పత్తి 2,865 క్వింటాళ్లు, వరి 35,020 క్వింటాళ్లు, కందులు 112 క్వింటాళ్లు, మొక్కజొన్న 40 వేల క్వింటాళ్లు, జొన్నలు 313 క్వింటాళ్లు, మినుములు 26 క్వింటాళ్లు, వేరుశనగ 850 క్వింటాళ్లు, ఆముదం 10 క్వింటాళ్లు ఇతర పంటలకు సంబంధించి 275 క్వింటాళ్లు కలిపి మొత్తం 50,173 క్వింటాళ్ల విత్తనాలు అవసరమవుతాయని భావిస్తున్నారు. అయితే రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు ఏర్పాట్లపై అధికారులు సిద్ధమవుతున్నారు.

నాగర్‌కర్నూల్‌: జిల్లాలో యాసంగి పంట ముగుస్తున్న క్రమంలో రైతులు వానాకాలం పంటలకు సిద్ధమవుతున్నారు. యాసంగి చివరలో జిల్లాకు కేఎల్‌ఐ నీరు నిలిచిపోవడంతో పంటలు ఎండిపోయి చాలామంది రైతులకు నష్టం వాటిల్లింది. అయితే పెట్టిన పెట్టుబడులు మాత్రమే ఆశించిన రైతులు ఈ వానాకాలంలో మంచి దిగుబడి సాధించాలనే ఆలోచనతో ఉన్నారు. దీనికి అనుగుణంగా జిల్లా వ్యవసాయ అధికారులు కూడా ప్రణాళికలను సిద్ధం చేశారు. ఈ ఏడాది వానాకాలంలో దాదాపు 5,38,462 ఎకరాల్లో రైతులు వివిధ రకాల పంటలు సాగు చేస్తారని భావిస్తున్నారు. అయితే గత సీజన్‌ వానాకాలంతో పోలిస్తే ఈసారి 1,02,770 ఎకరాల్లో అదనంగా సాగు చేస్తారని అంచనా వేశారు. అలాగే పండ్ల తోటలు, ఇతర పంటలు మరో 52,603 ఎకరాల్లో సాగు చేసేలా ప్రణాళిక రూపొందించారు. ఈసారి వర్షాలు సైతం ముందుగా కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పడంతో రైతులు వేసవి దుక్కులు మొదలుపెట్టారు.

సీజన్‌ ప్రారంభం వరకు..

రైతులు సాగు చేసే పంటలకు అనుగుణంగా ఎన్ని మెట్రిక్‌ టన్నుల ఎరువులు, విత్తనాలు అవసరమవుతాయో అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. జిల్లాకు సంబంధించి వివిధ రకాల ఎరువులు 99,150 మెట్రిక్‌ టన్నులు అవసరం అవుతాయని అంచనా వేశారు. ఇందులో యూరియా 40 వేల మె.ట., అవసరం ఉండగా ప్రస్తుతం 6,224 మెట్రిక్‌ టన్నులు అందుబాటులో ఉంది. అలాగే డీఏపీ 13 వేల మె.ట., గాను 866 మె.ట., ఎస్‌ఎస్‌పీ 1,800 మె.ట., గాను 578 మె.ట., ఎంఓపీ 4,350 మె.ట., గాను 487 మె.ట., కాంప్లెక్స్‌ ఎరువులు 40 వేల మె.ట., గాను 3,094 మె.ట., అందుబాటులో ఉన్నాయి. అయితే సీజన్‌ ప్రారంభం వరకు నెలవారి కోటా వస్తుందని, ఆ మేరకు రైతులకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉంచనున్నారు.

న్యూస్‌రీల్‌

ప్రణాళిక సిద్ధం 1
1/2

ప్రణాళిక సిద్ధం

ప్రణాళిక సిద్ధం 2
2/2

ప్రణాళిక సిద్ధం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement