
రక్తదానం.. ప్రాణదానం
నాగర్‌కర్నూల్ క్రైం: ఒక్కరి రక్తదానంతో ఎన్నో ప్రాణాలు నిలుస్తాయని రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ డా. సుధాకర్‌లాల్ అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలో నిర్వహించిన రెడ్‌క్రాస్ దినోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రతి ఒక్కరూ సేవాభావం కలిగి ఉండాలని.. అత్యవసర సమయంలో క్షతగాత్రులు, తలసేమియా వ్యాధిగ్రస్తులకు రక్తం అందించాలని సూచించారు. వేసవిలో రక్తం కొరత ఉంటుందని జిల్లాలోని యువత, స్వచ్ఛంద సంస్థలు రక్తదానం చేసేందుకు ముందుకురావాలని పిలుపునిచ్చారు.రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా కార్యదర్శి రమేష్‌రెడ్డి, వైస్ చైర్మన్ శ్రీధర్, ట్రెజరర్ రాధాకృష్ణ, కుమార్ పాల్గొన్నారు.