
కేసుల పరిష్కారానికి రాజీమార్గమే ఉత్తమం
నాగర్‌కర్నూల్ క్రైం: చిన్నచిన్న కేసుల పరిష్కారానికి రాజీ మార్గమే ఉత్తమమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్‌జడ్జి నసీం సుల్తానా అన్నారు. వచ్చే నెల 14న నిర్వహించే జాతీయ లోక్‌అదాలత్‌పై బుధవారం జిల్లా కోర్టులో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. రాజీ అయ్యే క్రిమినల్ కేసులు, పెట్టి కేసులు, డ్రంకెన్ డ్రైవ్, ఎకై ్సజ్ కేసులను జాతీయ లోక్‌అదాలత్‌లో పరిష్కరించుకోవచ్చని తెలిపారు. రాజీ మార్గం ద్వారా ఇరువర్గాలకు సమయం వృథా కాకపోవడంతో పాటు ఖర్చులు తగ్గుతాయన్నారు. అదే విధంగా ఇరువర్గాలకు న్యాయం చేకూరుతుందన్నారు. వచ్చే నెల 14న నిర్వహించే జాతీయ లోక్‌అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని కక్షిదారులకు సూచించారు. జాతీయ లోక్‌అదాలత్‌లో ఎక్కువ కేసులు రాజీ అయ్యేలా కృషిచేయాలని పోలీసు అధికారులకు సూచించారు. సమావేశంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్‌జడ్జి కావ్య, సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్‌జడ్జి శ్రీనిధి పాల్గొన్నారు.