
అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు
పెంట్లవెల్లి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూ భారతి రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ బదావత్ సంతోష్ కోరారు. గురువారం మండల కేంద్రంతో పాటు కొండూరులో జరిగిన సదస్సుల్లో ఆయన పాల్గొని రైతులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకుని దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ధరణిలోని లోపాలను సవరించి రైతుల సమస్యలు పరిష్కరించేందుకు భూ భారతి రూపొందించినట్లు చెప్పారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి సాధ్యమైనంత వరకు అక్కడే పరిష్కరించాలని ఆర్డీఓ బన్సీలాల్, తహసీల్దార్ విజయసింహకు సూచించారు. అలాగే మండలంలోని ఎంగంపల్లితండాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. నమూనా ప్రకారం ఇల్లు నిర్మించుకోవాలని, నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు. ఆయన వెంట ఆర్డీఓ బన్సీలాల్, తహసీల్దార్ విజయసింహ, ఆర్‌డబ్ల్యూఎస్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
వరి కొనుగోలు కేంద్రం తనిఖీ..
మండలంలోని జటప్రోలు, గోపులాపూర్‌లో ఉన్న కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ బదావత్ సంతోష్, ఆర్డీఓ బన్సీలాల్ తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోలులో ఎలాంటి సమస్యలు ఉండకూడదని, రైతులకు కచ్చితంగా రసీదు ఇవ్వాలన్నారు.
రెవెన్యూ సదస్సులను
సద్వినియోగం చేసుకోవాలి
కలెక్టర్ బదావత్ సంతోష్