
పిల్లలమర్రిలో ఏర్పాట్లు
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: ప్రపంచ సుందరి పోటీల్లో భాగంగా ఈనెల 16న జిల్లా కేంద్రంలోని పిల్లలమర్రిని విదేశీ పర్యాటకుల బృందం సందర్శించనుంది. దీంతో ఈనెల 2 నుంచి ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో వివిధ ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఈ ప్రాంతం మొత్తం ఎక్కడా చెత్తాచెదారం లేకుండా సుమారు 25 మంది కార్మికులతో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. అలాగే 500 చదరపు గజాల విస్తీర్ణంలో లాన్ (కార్పెట్ గ్రాస్) ఏర్పాటు చేస్తున్నారు. ఆహ్లాకర వాతావరణం ఉట్టిపడేలా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. వీటిని బుధవారం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డి.మహేశ్వర్‌రెడ్డి పరిశీలించి సిబ్బందికి తగు సూచనలిచ్చారు. మరోవైపు మెట్టుగడ్డ (ఎన్‌హెచ్–167) నుంచి మొదలుకొని పిల్లలమర్రి వరకు గల విశాలమైన రోడ్డుకు ఇరువైపులా మొక్కలను పెంచుతున్నారు. వీటి మధ్య పెరిగిన పిచ్చిమొక్కలను సైతం తొలగిస్తున్నారు.
16న పాలమూరుకు రానున్న
మిస్‌వరల్డ్ పోటీదారులు
మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న పనులు