
చదువుతో పాటు క్రీడలు అవసరం
లింగాల: విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు ఎంతో అవసరమని డీవైఎస్‌ఓ సీతారాం నాయక్ అన్నారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న వేసవి కబడ్డీ శిక్షణ శిబిరాన్ని బుధవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా 10 గ్రామీణ వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్రీడల్లో కోచ్‌లు ఇచ్చే మెళకువలను నేర్చుకొని రాణించాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో కోచ్ ఎండీ అబ్దుల్లా, సహాయ కోచ్‌లు హరీశ్, నవీన్ పాల్గొన్నారు.
ఎల్‌ఎల్‌బీ ఫలితాలు విడుదల
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పీయూ పరిధిలోని లా కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల సెమిస్టర్–1, 3కి సంబంధించి ఫలితాలను పీయూ వీసీ శ్రీనివాస్ బుధవారం విడుదల చేశారు. సెమిస్టర్–1లో 74 శాతం ఉత్తీర్ణత కాగా, 3వ సెమిస్టర్‌లో 85 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఫలితాలను పీయూ వెబ్‌సైట్‌లో పొందుపరిచ్చినట్లు వీసీ తెలిపారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేష్‌బాబు, పీయూ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రవీణ, అడిషనల్ కంట్రోలర్ శాంతిప్రియ, కోఆర్డినేటర్ సురేష్ పాల్గొన్నారు.
430 మంది గైర్హాజరు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు కొనసాగుతున్నాయి. మొత్తం 47 పరీక్ష కేంద్రాల్లో రెండు సెషన్లలో కలిపి 430 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఉదయం సెషన్‌లో 4వ సెమిస్టర్‌కు సంబంధించి మొత్తం 8,924 మంది విద్యార్థులకు హాజరుకావాల్సి ఉండగా 8,524 మంది హాజరై 400 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం సెషన్‌లో సెమిస్టర్–5 బ్యాక్‌లాగ్ పరీక్షలకు సంబంధించి 299 మందికి 266 మంది హాజరయ్యారు.
ఆర్టీసీ డిప్యూటీ
ఆర్‌ఎంగా కవిత
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: ఆర్టీసీ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా డిప్యూటీ ఆర్‌ఎంగా జె.కవిత నియమితులయ్యారు. ఈమె ప్రస్తు తం హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ వర్క్‌షాప్‌లో మేనేజర్‌గా పని చేస్తున్నారు. కాగా, 2012లో మహబూబ్‌నగర్ డిపో మేనేజర్‌గా వ్యవహరించారు. ఇక ఖమ్మం డిప్యూటీ ఆర్‌ఎంగా పనిచేస్తూ గత నెలలో ఇక్కడికి బదిలీపై వచ్చిన భవానీప్రసాద్ పదోన్నతిపై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఆర్‌ఎంగా వెళ్లారు.