
పంటల మార్పిడితోనే అధిక దిగుబడులు
తెలకపల్లి: రైతులు ప్రతి సంవత్సరం పంటలు మార్పిడి చేస్తేనే అధిక దిగుబడులు సాధించవచ్చని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి అన్నారు. రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో భాగంగా తెలకపల్లిలో నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల అభ్యున్నతికి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. చెట్లను పెంచి పర్యావరణాన్ని కాపాడాలని రసాయన ఎరువులు తగ్గించి నేలతల్లి అరోగ్యాన్ని కాపాడాలని, అవసరం మేరకు యూరియా వాడాలని సూచించారు. ప్రభుత్వం రైతుల అభ్యున్నతి కోసం సబ్సిడీపై విత్తనాలు, యంత్రాలు సరఫరా చేస్తుందని వాటిని ఉపయోగించుకోవాలని చెప్పారు. పాలెం వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్లు సత్యనారాయణ, పుష్పలత మాట్లాడుతూ ఏ భూమిలో ఎలాంటి విత్తనాలు నాటాలి.. ఎంత మోతాదులో విత్తాలి.. ఎంత దిగుబడి వస్తుందో వంటి వివరాలు తెలుసుకుని అందుకు అనుగుణంగా పంటలు సాగు చేయాలన్నారు. ఇందుకోసం రైతులు భూసార పరీక్షలు చేయించుకోవాలని, సేంద్రియ ఎరువులు వాడాలని సూచించారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు వేణుగోపాల్‌రెడ్డి, సుమలత, పర్వత్‌రెడ్డి, రాజమహేందర్‌రెడ్డి, ఏఓ నర్మద, ఏఈఓలు రాజ్‌కుమార్, వెంకటయ్యగౌడ్, సత్యనారాయణగౌడ్, రైతులు తదితరులు పాల్గొన్నారు.